నగర మేయర్ కు గౌను కుట్టేది ఎవరు ? ఎక్కడుంటారు, ఖరీదు ఎంత

నగర మేయర్ కు గౌను కుట్టేది ఎవరు ? ఎక్కడుంటారు, ఖరీదు ఎంత

ghmc mayor frock : హైదరాబాద్ నగరానికి ప్రథమ పౌరుడు మేయర్. ఆయనకు ప్రత్యేక స్థానం అంటూ ఉంటుంది. కౌన్సిల్ సమావేశంలో, ఎవరైనా ప్రముఖులు వస్తే..ఆయన ధరించే గౌనుపై అందరీ దృష్టి వెళుతుంటుంది. తప్పనిసరిగా ఈ దుస్తులు ధరించే కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుంది. గౌన్ల మాదిరిగా ఉంటుంది. అయితే..ఈ గౌన్లు ఎక్కడ తయారు చేస్తారు ? ఎవరు తయారు చేస్తారనే ప్రశ్న అందరిలో వస్తుంటుంది.

ఇప్పుడు హైదరాబాద్ నగర మేయర్ గా గద్వాల విజయలక్ష్మీ ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈమెకు గౌను కుట్టడంలో బిజీగా ఉన్నారు. గౌన్లు తయారు చేసే టైలర్ ప్రవీణ్ కుమార్ బాహెతి. ఈయన కోఠీ బడీచౌడీ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. గౌన్లను అద్భుతంగా తీర్చిదిద్దడంలో అతనికా అతనే సాటి. ప్రవీణ్ కుమార్ బాహెతి విషయానికి వస్తే..1935 లో ఈయన తాత బన్సీలాల్ నారాయన దాస్ టైలర్ షాప్ స్థాపించారు. తండ్రి ద్వారా ఈ విద్యను నేర్చుకున్నట్లు ప్రవీణ్ వెల్లడించారు.

gadwal vijayalakshmi

1999 లీజ్ జుల్ఫికర్ ఆలీ మేయర్ అయిననాటి నుంచి ప్రత్యేక గౌన్లను కుట్టడం ప్రారంభించారు. అనంతరం మేయర్ గా ఎన్నికైన తీగల కృష్ణారెడ్డి, బండా కార్తీక, మాజీద్ హుస్సేన్, బొంతు రామ్మోహన్ లకు గౌన్లను కుట్టారు. ఇప్పుడు గద్వాల విజయలక్ష్మీకు కూడా గౌన్లు కుడుతున్నారు. దీంతో మేయర్లందరికీ ఇన్నేళ్లుగా గౌన్లు కుట్టిన రికార్డు తన సొంతం చేసుకున్నాడు.

mayor frock

బాహెతి తీర్చిదిద్దే గౌన్లకు నాణ్యమైన మ్యాటిఫాబ్రిక్స్, గోల్డెన్ లేస్ లను ఉపయోగిస్తారు. వీటి ధర రూ. 10 వేల నుంచి రూ. 60 వేల వరకు ఉంటుందని ప్రవీణ్ బాహెతి వివరించారు. న్యాయమూర్తులు, అడ్వకేట్స్ జనరల్స్, అన్ని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్ లర్ లకు, నల్సార్ కాన్వకేషన్ లకు ప్రత్యేక గౌన్లను కుట్టడంలో దిట్ట.