Hyderabad City Special : ఇంతకీ హైదరాబాద్ ఎందుకింత స్పెషల్ ?

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ కుదేలయితే.. హైదరాబాద్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపించింది. మరింత డిమాండ్ పెరిగింది ఇక్కడ ! ఇళ్ల గిరాకీ ఈ లెవల్లో కనిపించడానికి కారణం ఏంటి ?

Hyderabad City Special : ఇంతకీ హైదరాబాద్ ఎందుకింత స్పెషల్ ?

Why Hyderabad City Special For Living Demand

Hyderabad City Special : దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ కుదేలయితే.. హైదరాబాద్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపించింది. మరింత డిమాండ్ పెరిగింది ఇక్కడ ! ఇళ్ల గిరాకీ ఈ లెవల్లో కనిపించడానికి కారణం ఏంటి ? ఇప్పుడు సరే రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది ? రియల్ ఎస్టేట్ భూమ్ అంటే… నగరానికి ఓ వైపే ఉంటుంది మాములుగా ! ఒకప్పుడు మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి అంటూ.. హైదరాబాద్‌లో ఒకవైపే కనిపించేది డిమాండ్. గతేడాది లెక్కలు తీస్తే మాత్రం అందుకు డిఫరెన్స్ అనిపిస్తోంది. నగరానికి నాలుగు వైపులా ఫుల్ డిమాండ్ పెరిగింది. సిటీలోనే కాదు పరిసర ప్రాంతాల్లోనూ ఇదే రకమైన గిరాకీ కనిపిస్తోంది. ఇలా కొత్త ప్రాజెక్టులు లాంచ్ చేయడమే ఆలస్యం.. ఇలా ఎగురేసుకుపోతున్నారు కొనుగోలుదారులు. దీనికి తోడు భౌగోళిక పరిస్థితులు కూడా.. భాగ్యనగరాన్ని మరింత ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.

హైదరాబాద్‌లో ఇల్లు ఉండి తీరాలి అనుకునే వాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎక్కువ డిమాండ్ వినిపిస్తోంది. గతేడాది హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగానికి ఈ లెవల్ డిమాండ్ రావడానికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయ్. కొవిడ్‌ కారణంగా సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని జనాలు భావించడం, ఇళ్ల ధరలు కొద్దిగా తగ్గడం… రుణాలపై వడ్డీ రేట్లు తగ్గడం కూడా గిరాకీ పెరగడానికి కారణంగా కనిపిస్తోంది. స్టాంప్‌ డ్యూటీలు తగ్గించడంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంలాంటి చర్యల వల్ల కూడా కొవిడ్‌కన్నా ముందున్ననాటి పరిస్థితులు ఈ రంగంలో నెలకొన్నాయని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా ఈ లెవల్ డిమాండ్ పెరగడానికి కారణం అయిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

34అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్ నంబర్‌ వన్ :
ప్రభుత్వ విధానాలు దేశంలోని అన్ని నగరాలు వర్తించినా.. హైదరాబాద్‌లోనే డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది. విశ్వవ్యాప్తనగరంగా హైదరాబాద్ పేరు సాధిస్తోంది. ఏటా ఎన్నో సర్వేలు, ర్యాంకింగ్స్‌లో ముందు వరుసలో ఉన్న హైదరాబాద్‌.. ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుతూనే ఉంది. ఇప్పటికే సేఫియెస్ట్‌ జాబితాలోనూ చేరింది. 34అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్ నంబర్‌ వన్‌గా నిలిచింది. దీంతో దేశంలో మరెన్నో గొప్ప నగరాలు ఉన్నా.. వాటికి లేని డిమాండ్‌ హైదరాబాద్‌కు పెరుగుతోంది. భారత్‌లో అత్యంత నివాస యోగ్యమైన, సుస్థిరాభివృద్ధి కలిగిన, స్థిరమైన ఉపాధి కల్పించే నగరంగా అగ్రస్థానంలో నిలిచిందంటే… దాని వెనక కారణం కూడా ఇదే ! ఉపాధి.. ఉద్యోగపరంగా అందరినీ అక్కున చేర్చుకుంటుండడంతో భాగ్యనగరంలో సెటిల్‌ అయ్యేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు. అందులోభాగంగా ఇక్కడి ఇళ్లకూ ఈ స్థాయి డిమాండ్‌ ఏర్పడుతోంది.

భిన్నసంస్కృతుల మేళవింపే ప్రధాన కారణం :
ఇక హైదరాబాద్‌ కొత్తగా చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. భిన్నసంస్కృతుల మేళవింపే దీనికి ప్రధాన కారణం. దక్కన్‌ పీఠభూమి కావడంతో చల్లని వాతావరణం, ప్రకృతి విపత్తుల తాకిడి చాలా తక్కువ. నేరాలు రేటు అంతంతే ! ఆధునిక జీవన శైలి.. ఐటీ హబ్, బహుళ జాతి సంస్థలకు చిరునామాతో భాగ్యనగరం ఇతర ప్రాంతాల ప్రజలను ఇట్టే ఆకట్టుకుంటోంది. తక్కువ ధరకు సాఫ్ట్‌వేర్‌ నిపుణులు, మానవవనరులు పుష్కలంగా అందుబాటులో ఉండటంతో… స్టార్టప్స్ రాకకు దోహదం చేస్తున్నాయ్. ఇవే గాకుండా లైఫ్‌స్టైల్‌ తగ్గట్టుగా వినోద, రవాణా సౌకర్యాలు కలిగి ఉండటం కూడా హైదరాబాద్‌కు ప్లస్‌ పాయింట్‌గా మారింది.

హైదరాబాద్‌లో లివింగ్ కాస్ట్ చాలా తక్కువ :
హైదరాబాద్‌లో లివింగ్ కాస్ట్ తక్కువ. అందుబాటు ధరల్లోనే అద్దె ఇళ్లు దొరుకుతాయి. ఎవరి బడ్జెట్‌ తగ్గ ఇళ్లూ కొనుక్కోవడానికి రెడీగా ఉంటాయి. ఉద్యోగం చేసుకోగా.. అంతో ఇంతో పొదుపు చేసుకోవచ్చని భావిస్తున్న జనం.. భాగ్యనగరానికి చేరుకొని.. ఇళ్ల కొనుగోలుపై దృష్టిసారిస్తున్నారు. దీనికితోడు సిటీ చుట్టుపక్కల భూమి లభ్యత ఎక్కువ. ఔటర్ రింగ్‌ రోడ్‌ లోపలి వైపునే కొత్త వెంచర్లు ఎక్కువగా వస్తున్నాయి. రేట్లూ రీజనబుల్‌గా ఉన్నాయి. దీంతో మిగతా నగరాలతో పోలిస్తే ఇళ్ల ధరలు కూడా అదుపులో ఉంటున్నాయ్. దీంతో కొనుగోళ్లు పెరుగుతున్నాయ్. గతేడాది కూడా అదే కనిపించింది. అందుకే మిగతా మెట్రో నగరాల్లో రియల్ ఎస్టేట్ నష్టాలను చూస్తే.. హైదరాబాద్ మాత్రం స్ఫెషల్ అనిపించింది.