Komatireddy Venkat Reddy: సోనియా, రాహుల్ దగ్గరే తేల్చుకుంటా: ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి

మునుగోడులో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సమావేశాలకు తనను పిలవకపోవడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. పిలవని పేరంటానికి వెళ్లాలా అని ప్రశ్నించారు. ఈ అంశంపై శుక్రవారం 10టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.

Komatireddy Venkat Reddy: సోనియా, రాహుల్ దగ్గరే తేల్చుకుంటా: ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి

Komatireddy Venkat Reddy: మునుగోడులో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సమావేశాలకు తనను పిలవలేదని, ఈ అంశంపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దగ్గరే తేల్చుకుంటానన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి. మునుగోడులో జరగబోయే ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అనేక సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Divya Kakran: దివ్యా కాక్రన్ వివాదం.. ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

ఈ సమావేశాలకు పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు హాజరవుతున్నారు. అయితే, అక్కడ రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడైన వెంకట రెడ్డికి మాత్రం ఆహ్వానం అందలేదు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్పందించారు. శుక్రవారం 10టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘మునుగోడు సమావేశంపై నాకు సమాచారం ఇవ్వడంలేదు. పిలవని పేరంటానికి నేను వెళ్లాలా? మునుగోడులో మీటింగ్ పెట్టించి నన్ను తిట్టించారు. రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వెళ్తున్నారు. జానారెడ్డి ఇంటికి రేవంత్ వెళ్తారు. కానీ.. నా ఇంటికి రాలేదు. చుండూరులో నన్ను అసభ్యకరంగా తిట్టించారు. నన్ను వైన్స్‌లో పనిచేసే వాళ్లతో పోలుస్తారా? నన్ను హోంగార్డుతో పోల్చారు.

TS EAMCET: తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల.. ఏపీ విద్యార్థినికి మొదటి ర్యాంకు

నన్ను పార్టీ నుంచి పంపించివేసి కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయాలనుకుంటున్నారు. నేను కాంగ్రెస్ పార్టీని వీడను. ఇంటిపార్టీ నాలుగు ఓట్ల పార్టీ. మునుగోడు ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారు. ఈ అంశాలపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దగ్గరే తేల్చుకుంటా’’ అని కోమటిరెడ్డి వెంకట రెడ్డి వ్యాఖ్యానించారు.