Horoscope Today : నేడు గ్రహమాలిక.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు..!
శుభఫలితాలు కలుగుతాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అభివృద్ధికి సంబంధించిన వార్తలు వింటారు. ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుంది.

Horoscope Today
Horoscope Today: ఖగోళంలో అప్పుడప్పుడూ అద్భుతమైన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ రోజు నవగ్రహాలు ఎనిమిది రాశుల్లో వరుసగా ఉండి గ్రహమాలికా యోగాన్ని ఏర్పరిచాయి. ఫలితంగా దాదాపు అన్ని రాశుల వారికీ అనుకూల ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మేషం, మిథునం, ధనుస్సు రాశులవారికి అదనపు లాభాలు చేకూరుతాయి.
మేషం: రాహువు ఏకాదశం, కేతువు పంచమ కోణంలోకి మారడం వల్ల.. శుభఫలితాలు కలుగుతాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అభివృద్ధికి సంబంధించిన వార్తలు వింటారు. ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుంది. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
వృషభం: రాహువు రాశి మారడంతో శని శుభఫలితాలు ఇస్తాడు. రెండింట గురువు విశేషంగా యోగిస్తాడు. ఆరోగ్యం మెరుగవుతుంది. రాబడి విశేషంగా పెరుగుతుంది. విహార యాత్రలు చేపడతారు. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
మిథునం: ఏడాదిన్నరగా విసిగిస్తున్న రాహువు, కేతువులు రాశులు మారి అనుగ్రహించడానికి సిద్ధమయ్యారు. రుణ బాధలు నిదానంగా తీరుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. సాయిబాబా ఆలయాన్ని సందర్శించండి.
కర్కాటకం: ఆర్థిక విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దలతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. చివరి నిమిషంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. శివారాధన మేలు చేస్తుంది.
సింహం: ప్రయాణాల వల్ల బడలిక ఏర్పడుతుంది. పరిస్థితులు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబం మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. రామాలయాన్ని సందర్శించండి.
కన్య: మీ ప్రత్యర్థులే మీకు మిత్రులు అవుతారు. ఊహించని ప్రశంసలు అందుకుంటారు. ఆర్యోగంలో అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
తుల: శత్రువుల ఎత్తులను చిత్తు చేస్తారు. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అదృష్టం వరిస్తుంది. ఆకస్మిక ధనలాభం సూచితం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా చిక్కులు ఎదురవుతాయి. ఒక్కసారిగా పరిస్థితులు మారిపోతున్నట్టుగా అనిపిస్తుంది. తొందరపాటు తగదు. సాయంత్రానికి అన్నీ సర్దుకుంటాయి. వినాయకుడి ఆలయాన్ని సందర్శించండి.
ధనుస్సు: దైవం అనుకూలిస్తుంది. ఈ రోజు చేసే ప్రయత్నాలు పూర్తిస్థాయిలో విజయవంతం అవుతాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. సుబ్రహ్మణ్య స్తోత్రాలు పఠించండి.
మకరం: మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆర్థిక విషయాల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. మాట పట్టింపులకు పోవద్దు. అయినవారే కొన్ని విషయాల్లో పరీక్షిస్తారు. సాయంత్రానికి పరిస్థితులు మారుతాయి. హనుమాన్ చాలీసా పఠించండి.
కుంభం: విపత్కర పరిస్థితులు ఎదురవుతాయి. మీ పరువుకు భంగం వాటిల్లుతుంది. అందుకు మీ ప్రవర్తనే కారణం అవుతుంది. మీ వ్యవహార శైలి వల్ల అయినవారే దూరమవుతారు. ఎదుటివారు చేసిన మేలును గుర్తుంచుకోండి. శివారాధన శుభప్రదం.
మీనం: ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. శని పరీక్షించినా.. కేతువు ఆదుకుంటాడు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆర్థిక లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. ఏ విషయంలోనూ పట్టుదలకు పోవద్దు. దత్తత్రేయ స్తోత్రాలు పఠించండి.
(వ్యక్తిగత జాతక వివరాల కోసం సంప్రదించగలరు)
టి. భుజంగరామ శర్మ
77022 86008
Disclaimer : జ్యోతిష్యం అనేది పూర్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నిరూపితమైన శాస్త్రం కాదు. ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. ఇందులో కచ్చితత్వానికి హామీ ఇవ్వలేం. ఈ కంటెంట్ ఆధారంగా తీసుకునే ఏవైనా నిర్ణయాలపై మీదే బాధ్యత. వ్యక్తిగత, ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన విషయాల గురించి పూర్తి సమాచారం కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించండి. ఈ కంటెంట్ ద్వారా వల్ల కలిగే ఎలాంటి ఫలితాలకు మాది బాధ్యత కాదని గమనించాలి.