Horoscope Today: గజకేసరి యోగం యాక్టివేట్‌.. ఈరోజు అన్ని రాశుల వారికీ శుభ ఫలితాలే..!

స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు మంచి సమయం. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. దుర్గాదేవి ఆలయాన్ని దర్శించుకోండి.

Horoscope Today: గజకేసరి యోగం యాక్టివేట్‌.. ఈరోజు అన్ని రాశుల వారికీ శుభ ఫలితాలే..!

Pic Credit @ iStock

Updated On : May 22, 2025 / 12:17 AM IST

Horoscope Today: చంద్రుడు మీన రాశిలోకి ప్రవేశించడంతో.. గజకేసరి యోగం యాక్టివేట్‌ అవుతున్నది. చంద్రడు దాటి వెళ్లడంతో రాహువు కొంత ప్రశాంతత పొందాడు. చంద్రుడు సమీపించడంతో శని కూడా ప్రసన్నత చెందాడు. ఫలితంగా ఈరోజు దాదాపు అన్ని రాశుల వారికీ శుభ ఫలితాలే అధికంగా కలుగుతాయి.

మేషం: తలపెట్టిన కార్యాలు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. సూర్యారాధన శుభప్రదం.

వృషభం: చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. గతంలో నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. ఆస్తి తగాదాలు కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.

మిథునం: అదృష్టం కలిసివస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. వేంకటేశ్వరస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

కర్కాటకం: ఉద్యోగులకు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. రాబడి పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. సూర్యారాధనతో మేలు జరుగుతుంది.

సింహం: స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు మంచి సమయం. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. దుర్గాదేవి ఆలయాన్ని దర్శించుకోండి.

కన్య: ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. అధికారులతో స్నేహంగా ఉంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం.

తుల: శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులతో పనులు నెరవేరుతాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అధికారులతో స్నేహంగా ఉంటారు. వినాయకుడి ఆలయాన్ని సందర్శించండి.

వృశ్చికం: ఆదాయం స్థిరంగా ఉంటుంది. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాలు సాధిస్తారు. బంధుమిత్రుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. ఆదాయంపై మనసు నిలుపుతారు. శివారాధనతో మేలు జరుగుతుంది.

ధనుస్సు: ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.

మకరం: ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు చదువులో రాణిస్తారు. మంచి సంస్థలలో చేరే అవకాశం ఉంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొత్త పరిచయాలతో కార్యసిద్ధి ఉంది. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

కుంభం: ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. అనవసరమైన ఆలోచనలతో ప్రశాంతత లోపిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.

మీనం: రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. రామాలయాన్ని దర్శించండి.

(వ్యక్తిగత జాతక వివరాల కోసం సంప్రదించగలరు)
టి. భుజంగరామ శర్మ
77022 86008

Disclaimer : జ్యోతిష్యం అనేది పూర్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నిరూపితమైన శాస్త్రం కాదు. ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. ఇందులో కచ్చితత్వానికి హామీ ఇవ్వలేం. ఈ కంటెంట్ ఆధారంగా తీసుకునే ఏవైనా నిర్ణయాలపై మీదే బాధ్యత. వ్యక్తిగత, ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన విషయాల గురించి పూర్తి సమాచారం కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించండి. ఈ కంటెంట్‌ ద్వారా వల్ల కలిగే ఎలాంటి ఫలితాలకు మాది బాధ్యత కాదని గమనించాలి.