Drones In Agriculture : డ్రోన్, వరినాటే యంత్రాలకు.. సబ్సిడీ 50 శాతం
ముఖ్యంగా డ్రోన్. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో డ్రోన్లను వినయోగించి పురుగుమందులను పిచికారి చేస్తున్నారు. డ్రోన్ల వినియోగంతో కూలీల సమస్యను అధిగమించడమే కాకుండా, పురుగుమందులపై పెట్టే ఖర్చు 40 శాతం వరకు ఆదా అవుతున్నాయి.
Drones In Agriculture : వ్యవసాయం రైతులకు రోజు రోజుకు భారమవుతోంది. కూలి రేట్ల పెరుగుదల, కూలీల కొరత, ప్రకృతి విపత్తులతో ఇబ్బందులు పడుతున్నారు. తద్వారా దిగుబడి తగ్గడంతో పంటల సాగుపై సరిగా దృష్టిసారించలేక పోతున్నారు. వీటన్నీటిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాంత్రీకరణ పథకాన్ని రైతులకు అందుబాటులో కి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రాయితీపై అధునాతన పనిముట్లు, యంత్రాలను అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఇంతకీ ఈ యంత్రాల వలన కలిగే లాభం ఎంత..? వాటి ధర ఎంతా..? సబ్సిడీ ఎంతా..? ఇప్పుడు చూద్దాం..
READ ALSO : Integrated Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న.. చార్టర్డ్ అకౌంటెంట్
వ్యవసాయంలో ప్రస్తుతం యాంత్రీకరణ పెరిగిపోయింది. సాగుకు కూలీలు దొరక్కపోవడం.. కూలీ రేట్లు అధికమవడం …ఇతరత్రా కారణాలతో అన్నదాతలు యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. దుక్కి దున్నటం మొదలు పంట చేతికొచ్చే వరకూ యంత్రాలతోనే చేస్తున్నారు. దీంతో ఎద్దులతో దున్నడం తగ్గిపోయింది. ఒకప్పుడు ఏ గ్రామంలో చూసినా రైతుల ఇంటి ముందు పాడి పశువులు, కాడెడ్లు, ఎడ్లబండ్లు, వ్యవసాయ సామగ్రి కనిపిస్తూ ఉండేది. కానీ ప్రస్తుతం వాటి స్థానంలో ట్రాక్టర్లు, యంత్ర పరికరాలు దర్శనమిస్తున్నాయి.
READ ALSO : Mixed Farming : చేపలు, కోళ్లు, పశువులతో.. మిశ్రమ వ్యవసాయం చేస్తున్న రైతు
చిన్న, సన్న కారు రైతులు కూడా యాంత్రీకరణ వైపే మొగ్గు చూపాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే రైతులు అంత డబ్బు పెట్టి యాంత్రాలను కొనుగోలు చేయలేని పరిస్థితి. ఈ నేపధ్యంలో వరుసగా రెండు సంవత్సరాలు పంటలు నష్టపోయిన నర్సంపేట, వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాల రైతులకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది. యాంత్రీకరణ కోసం రూ.75 కోట్ల చొప్పున నిధులు కేటాయించి.. 50 శాతం రాయితీపై వ్యవసాయ పరికరాలు, యంత్రాలను అందించనుంది.
READ ALSO : Mixed Farming : ఒకే పంట విధానం కన్నా మిశ్రమ వ్యవసాయంతో అధిక లాభాలు..
ఇందులో ముఖ్యంగా డ్రోన్. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో డ్రోన్లను వినయోగించి పురుగుమందులను పిచికారి చేస్తున్నారు. డ్రోన్ల వినియోగంతో కూలీల సమస్యను అధిగమించడమే కాకుండా, పురుగుమందులపై పెట్టే ఖర్చు 40 శాతం వరకు ఆదా అవుతున్నాయి. సమయం కూడా కలిసి వస్తున్నది. దీంతో డ్రోన్ల వినియోగానికి రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే దీని పనితీరు.. దీనపై ఉన్న సబ్సిడీ ఏంటో ఇప్పుడు చూద్దాం..
READ ALSO : Drip Irrigation System : వ్యవసాయంలో పెరుగుతున్న మైక్రో ఇరిగేషన్ వాడకం !
తెలంగాణలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట వరి. అయితే చెరువులు, బావులు, కాలువల కింద ఒకేసారి నాట్లు పడుతుండంటంతో.. కూలీల సమస్య వేదిస్తోంది. ఇందుకోసం వరినాటే యంత్రాలు మార్కెట్ లోకి వచ్చినా.. అధిక ధరలు ఉండటంతో రైతులు కొనుగోలు చేయలేకపోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీతో రెండు నియోజక వర్గాల రైతులకు మేలు జరగనుంది. మరి వరినాటే యంత్రాల వలన ఎలాంటి ఉపయోగం ఉంది.. ధర ఎంతా.. వాటికి సబ్సిడీ ఎంత వర్తిందో ఇప్పుడు చూద్దాం…