Dairy Farm : విజయపథంలో డైయిరీని నిర్వహిస్తున్న యువరైతు
పశుపోషణ అనాదిగా రైతు జీవన వృత్తిలో భాగం. వ్యవసాయ పనుల్లో రైతుకు తోడ్పాటును అందించటంతోపాటు, పాడి ద్వారా రైతుకు నిత్యం ఆదాయాన్ని అందించే ఏకైక రంగం పశుపోషణ. అయితే పాడిపశువుల పెంపకం చెప్పినంత, విన్నంత సులభం కాదు.

Dairy Farm
Dairy Farm : వ్యవసాయానికి అనుబంధంగా, రైతుకు శాశ్వత ఉపాధిని కల్పిస్తున్న రంగం పాడిపరిశ్రమ. పెట్టిన పెట్టుబడినిబట్టి, పెంచే పశుజాతినిబట్టి ఈ రంగంలో రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. పాడి పరిశ్రమలో నష్టం వచ్చిందంటే అది కచ్చితంగా మన స్వయంకృతాపరాధమే. పశుపోషణను ఉపాధిగా మలుచుకుని, కంటికి రెప్పలా ఈ పరిశ్రమను వెన్నంటి వున్న వారికి లాభాలకు కొదవ వుండదని నిరూపిస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ యువరైతు మొదట్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురైనా , తోటి రైతుల నుంచి సలహాలను తీసుకుని, పట్టుదలతో కృషి చేస్తూ.. పాడి రంగంలో రాణిస్తున్నారు.
READ ALSO : Prevent Pests In Cotton : పత్తిలో చీడపీడలు నివారించేందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
పశుపోషణ అనాదిగా రైతు జీవన వృత్తిలో భాగం. వ్యవసాయ పనుల్లో రైతుకు తోడ్పాటును అందించటంతోపాటు, పాడి ద్వారా రైతుకు నిత్యం ఆదాయాన్ని అందించే ఏకైక రంగం పశుపోషణ. అయితే పాడిపశువుల పెంపకం చెప్పినంత, విన్నంత సులభం కాదు. పశువుల పెంపకంపై ప్రేమ ఉండాలి. మేలు జాతి పాడి పశువుల పెంపకంలో శాస్ర్తీయ యాజమాన్యం పద్ధుతులు పాటించినప్పుడే.. ఆశించిన పాల ఉత్పత్తి పొందేందుకు వీలుంటుంది.
READ ALSO : Soybean Cultivation : సోయాబీన్ సాగులో చీడపీడలు సస్యరక్షణ చర్యలు!
వీటినే తూచా తప్పకుండా పాటిస్తూ.. విజయపథంలోకి పయనిస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లా, లింగపాలెం మండలం, రంగాపురం గ్రామానికి చెందిన యువరైతు నిమ్మగడ్డ నరేష్. 2020 లో 60 లేగదూడెలతో ప్రారంభించిన డెయిరీని అనతి కాలంలోనే 200 గేదెల ఫాంగా మార్చారు. పాడి గేదెలకు శక్తి, పాలదిగుబడిని పెంచేందుకు తగిన మోతాదులో దాణాను అందిస్తున్నారు.
READ ALSO : Mixed Farming : మిశ్రమ వ్యవసాయంతోనే లాభాలు
ప్రస్తుతం రోజుకు 1200 నుండి 1300 లీటర్ల పాల దిగుబడిని తీస్తున్నారు. భవిష్యత్తులో మరింత పెంచేందుకు కృషి చేస్తామంటున్నారు. డెయిరీ నిర్వహణ అంటే కష్టంతో కూడుకున్నదే… కానీ ముందు చూపుతో ఒక లెక్కతో, పక్కాగా పశుపోషణ నిర్వహిస్తే, కష్టానికి తగిన ప్రతిఫలం పొందవచ్చు. శాస్రీయ అవగాహనతో పాటు సంపూర్ణ నిమగ్నతతో కూడిన ఆచరణ తోడైతేనే విజయం మీ వెంటే ఉంటుంది.