Redgram : కందిపంటలో రైతులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు
బగ్స్ జాతికి చెందిన మూడు రకాల పురుగులు కాయల నుండి రసాన్ని పీల్చి నష్టపరుస్తాయి. ఒక రకం గోధుమ రంగు, భుజాల మీద రెండు ముళ్ళతో ఉంటాయి. రెండో రకం ముదురు గోధుము రంగు, గుండ్రటి భుజాలతో ఉంటాయి.

Redgram
Redgram : పత్యామ్నాయ పంటలలో కంది పంట ఒకటి. తక్కువ ఖర్చు, లాభం ఎక్కువ సరైన శాస్త్రీయ మెలకువలు , సస్యరక్షణ పద్దతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. కందిపంట ఆశించే చీడపాటల విషయంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
READ ALSO : Rice Cultivation : వరిలో ఎరువుల యాజమాన్యం
కందిలో సమగ్ర సస్యరక్షణ ;
వేసవిలో లోతైన దుక్కులు చేయాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలు అమర్చాలి. మరియు 8-10 పక్షి స్థావరాలను ఎకరాకు అమర్చుకోవాలి. ఎరపంటగా బంతి పూల మొక్కలను వేయాలి.
ఈకరెక్కపురుగు: ఇవి ఎండు గడ్డి రంగులో సన్నని, పొడవైన ఈక “రెక్కలతో ఉంటాయి. ముందు రెక్కలు రెండుగా, వెనుక రెక్కలు మూడుగా చీలి ఉంటాయి. ఈ పురుగు పచ్చటి గుడ్లను పూ మొగ్గపై పెడుతుంది. లార్వా ముదురు అకు పచ్చ రంగులో కందె మాదిరిగా, చిన్న చిన్న ముళ్ళు కలిగి, కాస్త పొడవు వెంట్రుకలతో ఉంటుంది. లార్వాలు పూ మొగ్గలను, పువ్వులను తిని కాయలను తొలిచి నష్టపరుస్తాయి. ఇవి కాయ లోపల తల ఉంచి మిగతా శరీరాన్ని బయటే ఉంచి లోపల గింజలను తింటాయి. లార్వాలు ఎదిగిన తర్వాత గోధుమ రంగు కోశస్థ దశ ప్యూపాలుగా మారి కాయల మీదే ఉంటాయి. వర్షాలు తగ్గిన తర్వాత ఈ పురుగులు ఆశిస్తాయి.
READ ALSO : Pesara Farming :పెసరలో ఎర్రగొంగళి పురుగు బెడద.. నివారణకు చేపట్టాల్సిన చర్యలు
నివారణ :
ఎసిఫేట్ 75% యస్.పి. 1.5 (గ్రా. లేదా మోనోక్రోటోఫాస్ 86% యనస్.ఎల్ 1.6 మి.లీ. లేదా క్వినాల్‌ఫాన్ 25% ఇ.సి. 2.0 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి.
కాయ తొలిచే ఆకు వచ్చ పురుగు : ఈ పురగు కంది చివరి దశలో ఎక్కువగా అశిస్తుంది. రెక్కల పురుగు ముందు రెక్కలు గోధుమ రంగులో ఉండి పై అంచున తెల్లని చార కలిగి ఉంటుంది. ఇవి పెరిగే పిందెలపై తెల్లటి గుడ్లను గుంపుగా పెడుతాయి. చిన్న చిన్న లార్వాలు ఆకుపచ్చగా ఉండి, పెరిగే కొద్దీ గులాబీ ఎరుపుగా మారతాయి. తల మీద గింజలను తింటాయి. లార్వా విసర్జించిన మలినాలు కాయ లోపల ఉంటాయి.
నివారణ :
అజాడిరెక్టిన్ 0.03%, వేప నూనె (300 పిపిఎమ్) 2.5-5 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఎసిఫేట్ 75% యస్.పి. 1.5 (గ్రా. లేదా మోనోక్రోటోఫాస్ 36% యస్.ఎల్. 1.6 మి.లీ. లేదా క్వినాల్‌ఫాస్ 25% ఇ.సి. 2.0 మి.లీ. / లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
READ ALSO : Green Gram Cultivation : ఖరీఫ్ కు అనువైన పెసర రకాలు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం
కాయతొలిచే ఈగ ; ఈ పురుగు దీర్హకాలిక రకాలలో ఎక్కువగా ఆశిస్తుంది. తల్లి ఈగ తెల్ల గుడ్డను అభివృద్ధి చెందుతున్న పిందెలలో చొప్పిస్తుంది. గుడ్ల నుండి వచ్చే కాళ్ళు లేని తెల్ల పిల్ల పురుగులు వృద్ధి చెందుతున్న గింజలను, చారలు, గూళ్ళు చేసి తింటాయి. ఒక్కో వురుగు జీవిత కాలంలో కొద్దిపాటి గింజలను మాత్రమే తింటుంది. పురుగు తిన్న గింజ పనికిరాదు. కాయలోనే నిద్రావస్థలోకి వెళ్ళి కాయ నుండి పిల్ల పురుగు చేసిన ఆవ గింజంత రంధ్రము ద్వారా తల్లి పురుగు బయటకి వస్తుంది. కాత దశలో బెట్ట వాతావరణ వరిస్థితులుంటే పూత, పిందె దశలలో ఈ పురుగు ఆశిస్తుంది.
నివారణ :
ఎనిఫేట్ 75% యస్.పి 1.5 గ్రా. లేదా మోనోక్రోటోఫాస్ 36% యన్.ఎల్ 1.6 మి.లీ. లేదా లామ్డా సైవోలోత్రిన్ 5% ఇ.సి. 1.0 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
READ ALSO : Kandi Cultivation : కందిపంట సాగులో విప్లవాత్మక మార్పులు.. సాగులో మెళకువలు
కాయ రనం పీల్చే పురుగులు : బగ్స్ జాతికి చెందిన మూడు రకాల పురుగులు కాయల నుండి రసాన్ని పీల్చి నష్టపరుస్తాయి. ఒక రకం గోధుమ రంగు, భుజాల మీద రెండు ముళ్ళతో ఉంటాయి. రెండో రకం ముదురు గోధుము రంగు, గుండ్రటి భుజాలతో ఉంటాయి. మూడో రకం అకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ పురుగులు గుడ్లను గుంపులుగా ఆకుల మీద, కాయల మీద పెడతాయి. పిల్ల, తల్లి పురుగులు కాయలోని గింజల నుండి రసం పీల్చడం వలన గింజలు నొక్కులుగా మారి, ఎండిపోయి మొలకెత్తవు. బెట్ట వాతావరణ పరిస్థితులలో పిందె, కాయ అభివృద్ది చెందే దశలలో (నవంబర్ – డిసెంబర్) ఈ పురుగులు పంటను ఆశిస్తాయి.
నివారణ ; డైమిథోయేట్ 30% ఇ.సి 2.0మి.లీ మోనోక్రోటోఫాస్ 36% యస్.ఎల్ 1.6మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.