Cotton Bollworms : తామర పురుగుల కారణంగా తలమాడు తెగులు

Cotton Bollworms : ప్రస్తుతం పత్తి పంట వివిధ ప్రాంతాలలో పూత, కాత దశలో ఉంది. ముందుగా విత్తుకున్న ప్రాంతాల్లో కాయ పగిలే దశలో ఉంది. అయితే వరుసగా కురుస్తున్న వర్షాలకు చీడపీడల బెడద అధికమైంది.

Cotton Bollworms : తామర పురుగుల కారణంగా తలమాడు తెగులు

Control Of Bollworms In Cotton

Updated On : October 14, 2024 / 2:32 PM IST

Cotton Bollworms : పత్తి పంట వివిధ దశల్లో ఉంది. వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా పత్తి చేలల్లో కలుపు సమస్య అధికమైంది. దీంతో చాలా చోట్ల తలమాడు తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త అశ్విని.

ప్రస్తుతం పత్తి పంట వివిధ ప్రాంతాలలో పూత, కాత దశలో ఉంది. ముందుగా విత్తుకున్న ప్రాంతాల్లో కాయ పగిలే దశలో ఉంది. అయితే వరుసగా కురుస్తున్న వర్షాలకు చీడపీడల బెడద అధికమైంది. ముఖ్యంగా పత్తి చేలల్లో.. గట్లపైన కలుపు సమస్య పెరిగింది.

అయితే, వర్షాల కలుపు తీతకు అడ్డంకిగా మారడంతో తామరపురుగులు వృద్ధి చెంది.. పత్తిపంటకు తలమాడు తెగులు ఆశించి నష్టం చేస్తోంది. దీనిని గుర్తించిన వెంటనే రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త అశ్విని.

Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..