Cow Dairy : ఆవుల డెయిరీ నిర్వహిస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్

కొన్నేళ్ల పాటు సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని చేశారు. అయితే పశువులపై ఉన్నమమకారంతో సొంత ఊరికి వచ్చి.. డెయిరీ ఫాం నిర్వహిస్తున్నారు. మొదట 2 ఆవులతో ప్రారంభించిన డెయిరీ ప్రస్తుతం 40 ఆవులు , 12 దూడలు ఉన్నాయి.

Cow Dairy : ఆవుల డెయిరీ నిర్వహిస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్

COW DAIRY

Cow Dairy : వ్యవసాయానికి అనుబంధంగా, రైతుకు శాశ్వత ఉపాధిని కల్పిస్తున్న రంగం పాడిపరిశ్రమ. పెట్టిన పెట్టుబడినిబట్టి, పెంచే పశుజాతినిబట్టి ఈ రంగంలో రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. పాడి పరిశ్రమలో నష్టం వచ్చిందంటే అది కచ్చితంగా మన స్వయంకృతాపరాధమే.  పశుపోషణను ఉపాధిగా మలుచుకుని, కంటికి రెప్పలా ఈ పరిశ్రమను వెన్నంటి వున్న వారికి లాభాలకు కొదవ వుండదని నిరూపిస్తున్నారు అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువరైతు. 6 సంవత్సరాలుగా  ఆవుల పెంపకాన్ని చేపట్టి సత్ఫలితాలు సాధిస్తున్నారు.

READ ALSO : Prawn Feeding : వ్యాధినిరోధక శక్తి పెరిగి.. పెట్టుబడులు తగ్గించే రొయ్యల దాణా

పశుపోషణ అనాదిగా రైతు జీవన వృత్తిలో భాగం. వ్యవసాయ పనుల్లో రైతుకు తోడ్పాటును అందించటంతోపాటు, పాడి ద్వారా రైతుకు నిత్యం ఆదాయాన్ని అందించే ఏకైక రంగం పశుపోషణ. డెయిరీ ద్వారా వచ్చే ఎరువువల్ల వ్యవసాయంలో కలిగే ప్రయోజనాలు అనేకం. కానీ ఇప్పుడు పాడి, పంట వేరుకావటంతో కేవలం వ్యవసాయంపై ఆధారపడిన రైతులు అనేక కష్టనష్టాలు ఎదుర్కుంటున్నారు. ఈ రెండింటితో ముందుకు సాగే రైతులు ప్రగతి పథంలో పయనిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు.. అనంతపురం జిల్లా, నార్పల మండలం, చక్రాయపేట గ్రామానికి చెందిన యువరైతు మధుసూదన్ రెడ్డి.

READ ALSO : Betel Leaf Plant : ఇంట్లో తమలపాకు చెట్టును ఏ దిక్కున పెంచాలో తెలుసా?

రైతు మధుసూదన్ రెడ్డి చదివింది బీఈ కంప్యూటర్ సైన్స్. కొన్నేళ్ల పాటు సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని చేశారు. అయితే పశువులపై ఉన్నమమకారంతో సొంత ఊరికి వచ్చి.. డెయిరీ ఫాం నిర్వహిస్తున్నారు. మొదట 2 ఆవులతో ప్రారంభించిన డెయిరీ ప్రస్తుతం 40 ఆవులు , 12 దూడలు ఉన్నాయి. వీటికి పశుగ్రాసం కోసం 7 ఎకరాల్లో..  కో.ఎస్.ఎస్, సూపర్ నేపియర్, ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్, జొన్న, మొక్కజొన్న వంటి  పశుగ్రాసాలను పెంచుతున్నారు. వీటితో పాటు మిశ్రమ దాణా అందిస్తూ.. ప్రతి రోజుకు 500 నుండి 550 లీటర్ల పాల దిగుబడి తీస్తున్నారు. స్థానికంగా ఉన్న పాలకేంద్రానికి పాలను తరలిస్తూ… మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. అంతే కాదు తనతో పాటు మరికొంత మందికి ఉపాధి అందిస్తున్నారు.