Cultivation of Crops : ఎకరంలో 30 రకాల పంటల సాగు.. ఏడాదికి రూ. 3 లక్షల ఆదాయం
పందిళ్లు వేయకుండా నేలపైనే పంటలు పండిస్తూ కట్టి.. తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేస్తున్నారు. ఒక పంట కోత పూర్తయ్యేసరికి మరో పంట చేతికి వస్తుంది.. పూర్తైయి పంట స్థానంలో మరో పంటను నాటడం.. ఇలా ప్రణాళికాబద్ధంగా సాగు చేపట్టి... ఏడాది పొడవునా నిత్యం ఆదాయం పొందుతున్నారు.

Cultivation of Crops
Cultivation of Crops : కూరగాయల సాగుతో అధిక లాభాలు ఆర్జిస్తున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు. పది ఎకరాల ఉన్న వారి కంటే ఒక ఎకరంలోనే 30 రకాల పంటలు సాగు చేస్తూ.. ఏడాదికి 3 లక్షల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నారు. కూలీల అవసరం లేకుండా ఇంటివారే సాగు చేస్తూ… ఖర్చులు తగ్గించుకుని లాభాల మార్గంలో ప్రయాణిస్తున్నారు.
READ ALSO : Ragi Crop : రాగిపంటకు తెగుళ్ల బెడద.. నివారిస్తే మంచి దిగుబడులు
వాయిస్ ఓవర్ : ప్రకాశం జిల్లా , కొత్తపట్నానికి చెందిన మల్లీశ్వరి.. కొత్త పంథాలో పయనిస్తూ వ్యవసాయంలో లాభాలు అందుకుంటున్నారు. ఆమే విజయసూత్రం.. మిగిలిన రైతుల్లా వాణిజ్య పంటల జోలికి వెళ్లలేదు. కేవలం ఎకరం భూమిలోనే నిరంతరం ఆదాయం ఉండే.. కాకర, బీర, సొర, బెండ, వంకాయ, ఆకుకూరలు, పూలు, జొన్న, మొక్కజొన్న ఇలా రకరకాల పంటలు సాగు చేపట్టారు.
READ ALSO : Pests in Cotton : పత్తిలో తొలిదశలో వచ్చే చీడపీడల నివారణ
పందిళ్లు వేయకుండా నేలపైనే పంటలు పండిస్తూ కట్టి.. తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేస్తున్నారు. ఒక పంట కోత పూర్తయ్యేసరికి మరో పంట చేతికి వస్తుంది.. పూర్తైయి పంట స్థానంలో మరో పంటను నాటడం.. ఇలా ప్రణాళికాబద్ధంగా సాగు చేపట్టి… ఏడాది పొడవునా నిత్యం ఆదాయం పొందుతున్నారు.
ప్రధాన వాణిజ్య పంటలను సాగుచేస్తే… పెట్టుబడి తిరిగి రావాలంటే కనీసం 120 నుంచి 150 రోజులు సమయం పడుతుంది. అదే తక్కువ సమయంలో చేతికొచ్చే చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, పూలు లాంటివి అంతర పంటలుగా సాగు చేస్తే నాటిన 20 రోజుల నుంచే దిగుబడుల మొదలవుతాయి.
READ ALSO : Paddy Harvesting : నారు, నాట్లు అవసరం లేకుండా వరిసాగు
ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దెబ్బతిన్నా.. తక్కువ నష్టంతో బయటపడవచ్చను. అందుకే సన్న, చిన్నకారు రైతులను ప్రకృతి సాగు వైపు మొగ్గు చూపేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రకృతి వ్యవసాయం లాభదాయకంగా ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుంది. సేంద్రియ పద్ధతిలో ఆరోగ్యవంతమైన పంటలు పండించడం ఆరోగ్యంగా ఉంది.