Dragon Fruit Cultivation : జైన్ రకం డ్రాగన్ ఫ్రూట్ సాగు ఏడాదికి రూ. కోటీ 50 లక్షల ఆదాయం
డ్రాగన్ ఫ్రూట్.. మంచి పోషకాలు ఉన్న పండు. గిరాకీ కూడా ఎక్కువే. పట్టణాల్లోనూ, నగరాల్లోనూ ఇటీవల కాలంలో డ్రాగన్‌ఫ్రూట్ కొనేవారి సంఖ్య పెరిగింది. షాపింగ్ మాల్స్‌లో వీటికి విపరీత గిరాకీ లభిస్తోంది.

Dragon Fruit Cultivation
Dragon Fruit Cultivation : ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన, కొత్త ఉద్యాన పంట డ్రాగన్ ఫ్రూట్. మన ప్రాంతంలో వీటి సాగుకు, అనుకూలమైన పరిస్థితులు ఉండటంతో, రైతులు ఈ పంటను అధిక విస్తీర్ణంలో సాగుచేశారు. అయితే… ఈ పంటసాగులో మార్కెట్ సమస్యలు వచ్చినా.. వాటిని అధిగమించిన వారికి మంచి లాభాలను పొందుతున్నారు. ఈ కోవకు అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు మాత్రం మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. లాభాల బాటలో పయనిస్తున్నారు.
డ్రాగన్ ఫ్రూట్.. మంచి పోషకాలు ఉన్న పండు. గిరాకీ కూడా ఎక్కువే. పట్టణాల్లోనూ, నగరాల్లోనూ ఇటీవల కాలంలో డ్రాగన్‌ఫ్రూట్ కొనేవారి సంఖ్య పెరిగింది. షాపింగ్ మాల్స్‌లో వీటికి విపరీత గిరాకీ లభిస్తోంది. ఒక్కొ కిలో ధర 150 రూపాయలు పలుకుతుండటంతో, సంప్రదాయ పంటలు సాగుచేసే రైతులు సైతం.. ఎంతో కొంత విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేశారు.
READ ALSO : కింద కూర్చుని భోజనం చేస్తే మీ గుండె సేఫ్..!
అయితే చాలా మంది రైతులు నిలవగుణం తక్కువగా ఉండి.. తీపి తక్కువగా ఉన్న రకాలను సాగుచేయడంతో మార్కెట్లో ఆదరణ తగ్గింది. కానీ అనంతపురం జిల్లా, గార్లదిన్నె మండలం, మర్తాడా గ్రామానికి చెందిన రైతు రమణారెడ్డి తైవాన్ నుండి జైన్ రకం డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను దిగుమతి చేసుకొని 5 ఏళ్ల క్రితం 3 ఎకరాల్లో నాటారు. నాటిన మొదటి ఏడాది నుండే దిగుబడులు ప్రారంభమయ్యాయి.
ఈ రకం అధిక వేడిని తట్టుకోవడమే కాకుండా.. ఈ పండులో తీపి, నిల్వగుణం ఎక్కువగా ఉండటంతో మార్కెట్ లో మంచి ఆదరణ పొందుతోంది. గత ఏడాది మూడు ఎకరాలపై పండ్లు, మొక్కల అమ్మకంపై కోటీ 50 లక్షల ఆదాయం పొందారు. ప్రస్తుతం 5 వ పంట దిగుబడులను తీస్తున్నారు.