Kashmir Saffron : ఇంట్లోనే కశ్మీర్ కుంకుమపువ్వు సాగు

రకరకాల ప్రయోగాలతో పంటలకు కావాల్సిన వాతావరణాన్ని రైతులే సృష్టిస్తూ.. సాగుచేస్తున్న రోజులివి. ఈ కోవలోనే అన్నయ్య జిల్లా, మదనపల్లె కు చెందిన  యువరైతు శ్రీనిధి.. కశ్మీరీ కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.

Kashmir Saffron : ఇంట్లోనే కశ్మీర్ కుంకుమపువ్వు సాగు

Saffron Farming

Updated On : August 2, 2023 / 8:46 AM IST

Kashmir Saffron : బంగారంలో సమానంగా ఉండే కుంకుమపువ్వు.. చలచల్లని కశ్మీర్ లో మాత్రమే కనిపిస్తుంది. అదీ కొన్ని నెలలు మాత్రమే సాగవుతుంది. అలాంటిది అన్నమయ్య జిల్లా, మదనపల్లెకు చెందిన అగ్రికల్చర్ పట్టబద్రురాలు ఏకంగా తన ఇంట్లోనే ఏడాదంతా కుంకుమ పువ్వును పండిస్తుంది. శీతలవాతావరణంలో సాగయ్యే ఈ పంట మదనపల్లెలో ఎలా పండుతుంది అనే సందేహం కలుగుతుంది కదూ.. అయితే ఈ స్టోరీ చూడాల్సిందే…

READ ALSO : Paddy Cultivation : వరి పంటలో చీడపీడల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

పంటలు పండాలంటే పొలం ఉండాలి.. నీళ్లు పుష్కలంగా అందాలి అనే రోజులు పోయాయి. అవేం లేకపోయినా రకరకాల ప్రయోగాలతో పంటలకు కావాల్సిన వాతావరణాన్ని రైతులే సృష్టిస్తూ.. సాగుచేస్తున్న రోజులివి. ఈ కోవలోనే అన్నయ్య జిల్లా, మదనపల్లె కు చెందిన  యువరైతు శ్రీనిధి.. కశ్మీరీ కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు. వినడానికి వింతగ ఉన్న ఇది వాస్తవం. ఇప్పుడు కుంకుమపువ్వు సాగు కోసం కశ్మీర్ కు వెళ్ళవలసిన అవసరం లేదు. కశ్మీర్ యొక్క వాతావరణ పరిస్థితులను కృత్రిమంగా సృష్టించి పంట పండిస్తూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు .

READ ALSO : Shade Net :షేడ్ నెట్ కింద ప్రోట్రేలలో నారు పెంపకం

శ్రీనిధి చదివింది ఎమ్మెస్సీ అగ్రికల్చర్. అగ్రికల్చర్ లో ఏదైనా కొత్తగా చేయాలన్న ఉద్దేశంతో కశ్మీర్ లో పండే కుంకుమపువ్వును సాగుచేయాలనుకుంది. అందుకోసం తన ఇంటిలోనే వాతావరణ పరిస్థితులు కలిపించి.. 2022 సంవత్సరంలో కశ్మీర్ నుండి విత్తనాలను తీసుకొచ్చి , ఆగస్టు లో పంట సాగు  ప్రారంభించింది. ఏరోఫోనిక్ పద్ధతిలో ట్రేలలో పంట సాగుచేపట్టింది. ప్రస్తుతం పంట దిగుబడులు ప్రారంభమయ్యాయి.