Intercrop Palm Oil : పామాయిల్‎లో అంతర పంటగా చెరుకు సాగు

intercrop palm oil : ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రైతులు ఆయిల్ ఫాంలో అంతర పంటగా చెరకు సాగుచేస్తూ.. అదనపు ఆదాయం పొందుతున్నారు.

Intercrop Palm Oil : పామాయిల్‎లో అంతర పంటగా చెరుకు సాగు

Cultivation of sugarcane as an intercrop in palm oil

intercrop palm oil : తెలుగు రాష్ట్రాల్లో దినదినాభివృద్ధి చెందుతున్న పంట ఆయిల్ పామ్. అయితే నాటిన మూడెళ్ల వరకు ఈ తోటల నుండి ఎలాంటి దిగుబడి రాదు కనుక, రైతులు మొదటి రెండు మూడు ఏళ్లు అంతర పంటలు సాగుచేస్తుంటారు. ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రైతులు ఆయిల్ ఫాంలో అంతర పంటగా చెరకు సాగుచేస్తూ.. అదనపు ఆదాయం పొందుతున్నారు.

Read Also : Baby Corn Cultivation : తక్కువ పెట్టుబడి.. తక్కువ సమయంలోనే అధిక లాభాలు పొందుతున్న రైతు 

అంతర పంటగా చెరకుసాగు :
ఇదిగో ఇక్కడ చూడండీ.. ఈ పామాయిల్ తోటను. మొత్తం 14 ఎకరాల్లో విస్తరించిన ఈ తోట పశ్చిమగోదావరి జిల్లా, గోపాలపురం మండలం , జగన్నాథపురం గ్రామంలో ఉంది. ఈ తోట యజమాని వంగా సత్యనారాయణ శ్రీధర్. ప్రస్తుతం పామాయిల్ మొక్కలు రెండేళ్ల క్రితం పెట్టారు. అయితే నాటిన 3 ఏళ్ల వరకు దిగుబడి ఉండదు కాబట్టి, మొదటి మూడు సంవత్సరాలు అంతర పంటలుగా పలు పంటలు సాగుచేసి అదనపు ఆదాయం పొందారు.

ప్రస్తుతం  ఈ ఏడాది అంతర పంటగా 46 రకం చెరకును సాగుచేశారు రైతు. ప్రస్తుతం చెరకు నరుకుతున్నారు. ఎకరాకు 35 నుండి 40 టన్నుల దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ లో టన్ను చెరకు ధర రూ. 3,200 పలుకుతోంది. పెట్టుబడి రూ. 30 అవుతుంది.

సాగు భూమి తగ్గిపోతుండటం, చిన్న కమతాలు పెరిగిపోవటం వంటి కారణాలతో వ్యవసాయంలో నేడు రైతు మనుగడ ప్రశ్నార్ధకమవుతున్నపరిస్థితుల్లో… ప్రతీ రైతు ఆదాయం పెంచుకునే దిశగా… ఆధునిక పరిజ్ఞానంతో, ప్రణాళికాబద్దంగా ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Read Also : Pearl Farming Cultivation : ఇంటి ముందే సహజ పద్ధతిలో ముత్యాల సాగు చేపట్టిన అనంతపురం వాసి