Teak Cultivation : బంజరు భూముల్లో టేకు మొక్కల పెంపకం
మొక్కల ఎదుగుదల తర్వాత టేకు కర్రను అమ్మే పద్ధతి సులువుగానే ఉంటుంది. స్థానిక అటవీశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుని, చెట్లను నరికేందుకు అనుమతి తీసుకోవాలి.

Teak Cultivation
Teak Cultivation : టేకు సిరులు కురిపించే పంట. బంగారానికి సరి సమానమైన ఈ కలపతో తయారు చేసిన ఇంటి సామగ్రి, ఇతర వస్తువులు పదికాలాలపాటు పదిలంగా, నాణ్యతతో అందంగా కన్పిస్తాయి. అలాంటి కలప ప్రస్తుతం దొరకడం కష్టమైంది. ఇలాంటి పరిస్థితుల్లో టేకు కర్రకు విఫరీతమైన డిమాండ్ పెరిగింది . టేకు వనాలు పూర్తిగా తగ్గిపోవడం ప్రత్యామ్నాయంగా ఇతర చెట్ల కలపను ఉపయోగించుకునే పరిస్థితి నెలకొంది. రైతులు వ్యవసాయంతోపాటు టేకు చెట్ల పెంపకంపై ఆసక్తి చూపితే మంచి ఆదాయం పొందే అవకాశముంది. పొలం గట్లు, ఖాళీ స్థలాల్లో ఈ మొక్కలు నాటి, పెంచితే పర్యావరణంతోపాటు మంచి ఆదాయం పొందవచ్చని సూచిస్తున్నారు ప్రదాన శాస్త్రవేత్త రాజేశ్వర్ నాయక్.
READ ALSO : Mixed Farming : ఒకే పంట విధానం కన్నా మిశ్రమ వ్యవసాయంతో అధిక లాభాలు..
వ్యవసాయం జూదం లాంటిది. ప్రకృతి కరుణిస్తే పర్వాలేదు. పగబడితే నిండా మునిగిపోవాల్సిందే. కనీసం పెట్టుబడులు సైతం దక్కవు. ఇలా నష్టాల్లో కూరుకుపోకుండా రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాలి. బంజరు భూములు, పొలం గట్లు, ఖాళీ ప్రదేశాల్లో టేకు చెట్లను పెంచితే కొన్ని సంవత్సరాలకు మంచి లాభాలు గడించవచ్చు. ప్రభుత్వం ఇందుకు ప్రోత్సాహం అందిస్తోంది. గతంలో ఉద్యావనశాఖ, ఉపాధిహామీ ద్వారా రైతులకు టేకు, మామిడి, ఇతర మొక్కలను అందించారు. రెండు సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కింద నర్సరీల్లో టేకు, ఇతర మొక్కలను పెంచి రైతులకు ఉచితంగా అందిస్తోంది.
READ ALSO : Organic Farming : సేంద్రీయ వ్యవసాయంలో నత్రజని పోషక లోప నివారణకు చేపట్టాల్సిన చర్యలు
ఒక ఎకరానికి 1000 మొక్కలు నాటుకోవచ్చు . నాటిన తర్వాత మొక్కల చుట్టూ నీటి నిల్వ కోసం తవ్వి అందులో నీళ్లు ఇంకేలా తయారు చేసుకోవాలి. క్రమం తప్పకుండా నీళ్లుపోయాలి. ఆరు నెలలకోసారి రసాయన, సేంద్రియ ఎరువులను కలిపి మొక్కల అడుగు భాగంలో వేయాలి. ఇలా చేస్తే మొక్కల పెరుగుదుల సక్రమంగా ఉంటుంది. 20 ఏండ్లు పెంచితే 20 అడుగుల వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఒక ఘనపు అడుగు టేకు కర్రకు రూ. 3 వేల నుంచి రూ. 4 వేల వరకు ధర పలుకుతోంది. ఎకరంలో నాటిన చెట్లకు పెట్టుబడి, పర్మిట్ ఖర్చులుపోగా రూ.20 లక్షల వరకు ఆదాయం ఉంటుందని అధికారుల అంచనా.
READ ALSO : Organic Vegetable Farming : వ్యవసాయం చేస్తూ.. రైతుబజార్లో.. కూరగాయలు అమ్ముతున్న యువజంట
మొక్కల ఎదుగుదల తర్వాత టేకు కర్రను అమ్మే పద్ధతి సులువుగానే ఉంటుంది. స్థానిక అటవీశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుని, చెట్లను నరికేందుకు అనుమతి తీసుకోవాలి. తర్వాత రేంజి పరిధిలోని అటవీ క్షేత్రాధికారి చెట్లు, పట్టా భూమిలోనివా.. లేదంటే ప్రభుత్వ భూమిలోనివా అని ధ్రువీకరించుకుని చెట్లను నరికివేసేందుకు రవాణా చేసేందుకు అనుమతి జారీ చేస్తారు. ఏజెన్సీప్రాంతంలో అయితే జిల్లా పాలనాధికారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. చెట్లను కొనుగోలు చేసేందుకు జిల్లాలో చాలా మంది గుత్తేదారులు అందుబాటులో ఉన్నారు.వారికి సమాచారం అందిస్తే చెట్లను కొనుగోలు చేసి కలపను తీసుకెళతారు.