Brinjal Crop : ప్రకృతి విధానంలో వంగ సాగు
గొల్లపల్లి గామానికి చెందిన కొంత మంది రైతులు పెట్టుబడులను తగ్గించుకుంటూ ప్రకృతి వ్యవసాయంలో వంగ సాగుచేస్తున్నారు. నాణ్యమైన దిగుబడులను తీస్తూ.. మం, ఆదాయం పొందుతున్నారు.

Brinjal Crop
Brinjal Crop : వ్యవసాయంలో పెరిగిపోయిన పెట్టుబడి ఖర్చులు, గిట్టుబాటు కాని ధరలు… తదితర కారణాలతో రైతులు సాగంటేనే భయపడుతున్నారు. ప్రత్యామ్నాయ దారులు వెతుక్కుంటున్నారు. కానీ ఏలూరు జిల్లాకు, గొల్లపల్లి గామానికి చెందిన కొంత మంది రైతులు పెట్టుబడులను తగ్గించుకుంటూ ప్రకృతి వ్యవసాయంలో వంగ సాగుచేస్తున్నారు. నాణ్యమైన దిగుబడులను తీస్తూ.. మం, ఆదాయం పొందుతున్నారు.
READ ALSO : Onion Cultivation : ఉల్లి సాగులో అధిక దిగుబడికి పాటించాల్సిన మేలైన యాజమాన్యం
అధిక విస్తీర్ణంలో వంగతోటల సాగు ఏలూరు జిల్లా నూజివీడు మండలం, గొల్లపల్లి గ్రామంలో ఉన్నాయి. ఇక్కడి రైతులు గతంలో రసాయన ఎరువలతో పంటలు పండించేవారు. అయితే పంట దిగుబడులు అధికంగా వచ్చినా, పెట్టుబడులు పెరిగిపోయేవి. పెద్దగా లాభం ఉండేది కాదు.
READ ALSO : Pests in Rice : వరిపంటను ఆశించే తెగుళ్లు.. నివారణ
ప్రకృతి వ్యవసాయ గురించి తెలుసుకొని ఇప్పుడు చాలా మంది రైతులు కూరగాయల సాగుచేపడుతున్నారు. అతి తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు పొందుతున్నమని చెబుతున్నారు.