Castor Bean Crop : ఆముదం పంటకు నష్టం కలిగించే దాసరి పురుగు, నివారణ చర్యలు!

పెద్ద వురుగులు బూడిద రంగులో ఉండి పక్కలకు ఎరువు, ముదురు గోధుమ రంగు చారలు లేదా నల్లగా ఉండి పక్కలకు తెలుపు రంగు చారలుంటాయి. పెరిగినటువంటి లద్దె పురుగులు భూమిలో గాని, కిందపడిన, ఎండిన ఆకుల్లో గాని లేదా ముడుచుకొన్న అకుల్లోగాని కోశస్థదశలోకి ప్రవేశిస్తుంది.

Castor Bean Crop : ఆముదం పంటకు నష్టం కలిగించే దాసరి పురుగు, నివారణ చర్యలు!

Dasari insect which damages the castor bean crop, preventive measures!

Castor Bean Crop : ఆముదం పంటసాగులో మన దేశం మొదటి స్ధానంలో ఉంది. ఎగుమతుల ద్వారా అధిక విదేశీ మారక ద్రవ్యం లభిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం రైతులు ఆముదం సాగు చేపడుతున్నారు. వర్షాదరంతోకూడిన నిస్సార వంతమైన నేలలు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటాయి. అధిక దిగుబడి సాధించాలంటే వివిధ దశల్లో ఆశించే చీడపీడల నివారణకు రైతులు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఆముదం పంటను ఆశించే చీడపీడల్లో దాసరి పురుగు కూడా కూడా ఒకటి దీని విషయంలో రైతులు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

దాసరి పురుగు లేదా నామాల పురుగు : ఈ వురుగు ఉనికి జూలై-జనవరి వరకు గమనించినా ఆగమ్ట-సెప్టెంబరు, అక్టోబరుల్లో తీవ్రనష్టాన్ని కలిగిస్తుంది. లద్దెవురుగులు తొలిదశలో అకులను గోకీ తరువాత దశలో రంధ్రాలు చేసి ఆకులను తింటాయి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు లేత కొమ్మలను , కాడలను, పువ్వులను , పెరిగే కాయలను తిని నష్టాన్ని కలిగిస్తాయి. ఆకు పచ్చని గుడ్రని గుడ్లను విడిగా ఒకటి నుండి పది వరకు ఆకులపైన పెడుతుంది. గుడ్ల నుండి 2 నుండి 4 రోజుల్లో పిల్ల పురుగులు బయటకు వచ్చి ఆకులను తిని 11 రోజుల్లో పెద్దవి అవుతాయి.

పెద్ద వురుగులు బూడిద రంగులో ఉండి పక్కలకు ఎరువు, ముదురు గోధుమ రంగు చారలు లేదా నల్లగా ఉండి పక్కలకు తెలుపు రంగు చారలుంటాయి. పెరిగినటువంటి లద్దె పురుగులు భూమిలో గాని, కిందపడిన, ఎండిన ఆకుల్లో గాని లేదా ముడుచుకొన్న అకుల్లోగాని కోశస్థదశలోకి ప్రవేశిస్తుంది. కోశస్థదశలోని పురుగుపై తెల్లని బూడిదకప్పబడి ఉంటుంది. రెక్కల పురుగు యొక్క వెనుక జత రెక్కల మధ్యలో తెల్లని చార కలిగి 3-4 ముదురు గోధుమ రంగు చుక్కలు వెలుపలి అంచు వెంట కలిగి ఉంటాయి.

సస్యరక్షణ:

ఆగస్టు, సెప్టెంబరులో ఎక్కువగా దాసరి పురుగు గుడ్లను టైకోగ్రమా అనే వరాన్నజీవి, దానరి వురుగు నంతతిని అదువులో ఉంచుతుంది. ఒకవేళ పొలంలో దానరి వురుగు గుడ్డను గమనించినట్లయితే ఎకరానికి 50 వేల టైకోగ్రమా పరాన్నజీవులను వదిలి పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. అదే విధంగా పాలంలో లద్దె వురుగు దశలో ఆగస్టు సెష్టెంబరు-నవంబరు వరకు మైక్రోపైటిస్‌ మాక్యులిపెన్నిస్‌, యూపెక్టస్‌ మాటర్నన్‌ అనే పరాన్న జీవులు ఎక్కువగా ఆశించి లద్దె పురుగులను అదుపులో ఉంచుతాయి.

దాసరి పురుగు మొదటి దశలో అవసరమైతే పరాన్న జీవులకు ఎక్కువగా హాని చేయనటువంటి వేపనూనె 5 మి.లీ. లీటరు నీటికి కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిచేలా పిచికారి.
చేయాలి. పరాన్నజీవులు తక్కువగా ఉన్నప్పుడు అసిఫేట్‌ 1.5 గ్రా. లేదా క్లోరిపైరిఫాస్‌ 2.5 మి.లీ లేదా ప్రాఫెనోఫాన్‌ 2 మి.లీ లేదా కార్బరిల్‌ ౩ గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

దాసరి పురుగు పెద్దవిగా ఉన్నప్పుడు వాటిని ఏరి నాశనం చేయాలి. పొలంలో ఎకరానికి 10 పంగ కర్రలను పక్షులు వాలుటకు వీలుగా నాటుకున్నట్లయితే పాలంలోకి వక్షులు వచ్చి పురుగులను ఏరి తింటాయి. పొలంలో కింద పడినటువంటి ఎండు అకులను తీసి కాల్చి వేయాలి. వూర్తిగా వంట తరువాత పొలంలోని చెత్తను కాల్చినట్లయితే కోశస్థదశలోని దాసరి పురుగును నివారించవచ్చు.

పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో థయోడికార్స్‌ 1.5 గ్రా. లేదా నొవాల్యురాన్‌ 1 మి.లీ లేదా ల్యూఫెన్యురాన్‌ 1 మి. లీ లేదా రైనాక్సిపిర్‌ 0.3 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఎకరానికి 200 లీటర్ల మందు. ద్రావణం తప్పనిసరిగా పిచికారి చేయాలి.