Ploughs in Summer : వేసవి దుక్కులతో నేల సత్తువ – చీడపీడల నివారణతో దిగుబడులు

Ploughs in Summer : పంటచేలను చదును చేసి దుక్కులు దున్ని తొలకరికి ముందే విత్తుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. పంటకోతల అనంతరం భూమిని వృధాగా వదిలి వేయకుండా లోతుగా దుక్కి దున్నితే పంటలను ఆశించే చీడ, పీడలను నివారించవచ్చు.

Ploughs in Summer : వేసవి దుక్కులతో నేల సత్తువ – చీడపీడల నివారణతో దిగుబడులు

Deep Plough to prevent pests in Crops in Summer Season

Ploughs in Summer : రబీలో సాగు చేసిన పంటలు కోతలు, నూర్పిడులు అవుతున్నాయి. చాలా వరకు రైతులు పొలాలన్నీ ఖాళీగా ఉంచుతుంటారు. మళ్లీ వర్షాకాలం వరకు భూమిని దున్నకుండా వదిలేస్తుంటారు. దీంతో కలుపు మొక్కలు, ఇతర గడ్డి జాతి మొక్కలు పెరిగి, భూమిలోని తేమను, పోషకాలను గ్రహించి, భూమికి సత్తువ లేకుండా నిర్వీర్యం చేస్తాయి. దీని వలన భూమి సారాన్ని కోల్పోతుంది. ప్రస్తుత కాళీ సమయంలో భూసారాన్ని పెంపొందించుకునేందుకు రైతులు వేసవిదుక్కులు చేసుకోవాలని సూచిస్తున్నారు, ప్రధాన శాస్త్రవేత్త చిన్నామనాయుడు.

Read Also : Marrigold Cultvation : బంతి సాగుతో అధిక లాభాలు పొందుతున్న రైతు

ఈ ఖరీఫ్‌ సీజన్‌పై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు పొందాలంటే భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ముఖ్యంగా ఎర్ర గరప నేలలు, మెట్టనేలలు వాలుగా ఉంటాయి. దీంతో వర్షాకాలంలో వచ్చే వాన తాకిడికి నేత కోతకు గురి అవుతాయి. దీంతో పొలంలోని షోషక పదార్థాలు, మెత్తని మట్టి వాన నీటి ద్వారా కొట్టుకొని పోయి.. భూమి సారహీనంగా తయారువుతుంది. కాబట్టి నీటి వనరులను కాపాడుకుంటూనే, భూసారం పెంచుకోవాలని సూచిస్తున్నారు,  ప్రధాన శాస్త్రవేత్త చిన్నామనాయుడు.

వానాకాలం సాగుకు సమయం దగ్గర పడుతోంది. కాబట్టి పంటచేలను చదును చేసి దుక్కులు దున్ని తొలకరికి ముందే విత్తుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. పంటకోతల అనంతరం భూమిని వృధాగా వదిలి వేయకుండా లోతుగా దుక్కి దున్నితే పంటలను ఆశించే చీడ, పీడలను నివారించవచ్చు. అంతే కాకుండా పంట దిగుబడి సామర్థ్యం పెరుగుతుంది.

రైతులు సోదరులు వేసవిలో కురిసే తొలకరి జల్లులను ఉపయోగించుకొని భూమిని బాగా దుక్కి చేసుకోవాలి. తద్వారా భూమిలో తేమను నిల్వ చేసుకొనే శక్తి పెరగటమే కాకుండా, భూసారం కూడా పెంపొందించకోవచ్చు. అలాగే నేల కోతను నివారించుకోవచ్చు. కావున రైతలు ప్రతి 2-3 సంవత్సరాలకైనా వేసవిలో లోతు దుక్కులను చేసుకోవటం వల్ల అనేక లాభాలు పొంది, వర్షాధార పంటల్లో అధిక దిగుబడులు సాధించవచ్చు.

Read Also : Vegetable Cultivation : కూరగాయల సాగులో లాభాలు గడిస్తున్న రైతులు