Vegetable Cultivation : కూరగాయల సాగులో లాభాలు గడిస్తున్న రైతులు

వచ్చిన దిగుబడి నాణ్యత దెబ్బతినకుండా ప్యాకింగ్‌, రవాణాలో తగు జాగ్రత్తలు పాటించి.. గిరాకీ ఉన్న ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ చక్కటి లాభాలు  పొందుతున్నారు.

Vegetable Cultivation : కూరగాయల సాగులో లాభాలు గడిస్తున్న రైతులు

Farmers Get Huge Profits in Vegetable Cultivation

Updated On : April 14, 2024 / 4:21 PM IST

Vegetable Cultivation :  మార్కెట్‌ గిరాకీని గమనిస్తూ.. ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ.. తక్కువ పెట్టుబడితో చక్కటి లాభాలు గడిస్తున్నారు కొందరు రైతులు. వ్యవసాయంలో మెలకువలతో ముందుకు సాగితే.. లాభాల పండగేనని నిరూపిస్తున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన  రైతులు కుటుంబం. ఉన్న కొద్దిపాటి విస్తీర్ణంలో పలు కూరగాయలు పండిస్తూ.. మంచి ఆదాయం పొందుతున్నారు.

Read Also : Agriculture with Mulching : మల్చింగ్ తో ఆధునిక వ్యవసాయం

పరిమిత విస్తీర్ణంలో అధిక రాబడి పొందాలంటే కూరగాయలకు మించిన పంటలేదు. అందుకే నిజామాబాద్ జిల్లా, వడ్డాపల్లి గ్రామానికి చెందిన కొందరు రైతులు పలు రకాల కూరగాయలను సాగుచేస్తున్నారు. మార్కెట్ డిమాండ్ కి అనుగుణంగా వ్యవహరిస్తూ.. అధిక దిగుబడినిచ్చే సంకర జాతి గింజలను ఎంచుకుని  కూరగాయలు పండిస్తున్నారు. వచ్చిన దిగుబడి నాణ్యత దెబ్బతినకుండా ప్యాకింగ్‌, రవాణాలో తగు జాగ్రత్తలు పాటించి.. గిరాకీ ఉన్న ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ చక్కటి లాభాలు  పొందుతున్నారు.

Read Also : Agriculture Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న యువకుడు