Organic Vegetables : సెల్‌ఫోన్‌తోనే కూరగాయల వ్యాపారం.. ప్రకృతి విధానంలో సాగు

Organic Vegetables : ఆర్గానిక్ పంటలు పండించడమే కాదు స్వయంగా  మోహన రావు కుటుంభమే వినూత్న పద్దతిలో మార్కేటింగ్ కూడా చేస్తున్నారు. పండిచిన కూరగాయలను సూదూర ప్రాంతాలకు పంపించకుండా.. నరసన్నపేటలో మన మార్ట్ పేరిట మార్ట్ ప్రారంబిచారు.

Organic Vegetables : సెల్‌ఫోన్‌తోనే కూరగాయల వ్యాపారం.. ప్రకృతి విధానంలో సాగు

Whatsapp Organic Vegitable

Updated On : December 27, 2023 / 11:43 PM IST

Organic Vegetables : జీడి మామిడి తోటలను సాగు చేసే ఆ రైతుకు తిత్లీ తుఫాన్ కోలుకోలేని దెబ్బతిసింది. తుఫాను దాటికి తోటలన్నీ నేలమట్టమయ్యాయి. ప్రత్యమ్నాయ పంటలవైపు వెల్దామన్న ఆలోచన వచ్చేసరికి… కరోనా భూతం అడ్డగించింది. దీంతో సహజ సిద్దమైన ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాడు ఆరైతు. అతి తక్కువ కాలంలోనే ఆర్గానిక్ కూరగాయలు పండిస్తూ ఔరా అనిపిస్తున్నాడు . అంతే కాదు వాట్సాప్ ద్వారా నేరుగా వినియోగదారులకు అమ్ముతూ.. మంచి లాభాలను పొందుతున్నారు.

Read Also : Groundnut Farming : వేరుశనగలో అధిక దిగుబడులకోసం మెళకువలు

కూరగాయలు అందరు పండిస్తారు. వచ్చిన దిగుబడిని నేరుగా మార్కెట్ లో దళారులకు అమ్మడం రైతు చేసే పని. కొంతమంది మాత్రం వీది వీది తిరిగి అమ్ముకుంటారు. కానీ శ్రీకాకుళం జిల్లా, సారవకోట మండలం, పద్మాపురం గ్రామానికి చెందిన రైతు రావాడ మోహన రావు మాత్రం ఇందుకు భిన్నం. కూరగాయలు అందరిలాగే పండించినా.. వాటిని విక్రయించడంలో మాత్రం కొత్తపోకడలను అవలంబిస్తూ.. ఔరా అనిపిస్తున్నారు.

రైతు మోహన రావు తనకున్న ఇరవై ఏకరాల భూమిలో మామిడి, జీడిమామిడి తోటలను పెంచేవారు. అయితే .. తుఫాన్ దాటికి తోటలన్ని తూడుచుకుపెట్టుకు పోయాయి. దీంతో  ప్రత్యమ్నాయ పంటలు సాగుచేయాలనుకున్నారు. ఇందుకోసం మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలైన కూరగాయలను ఎంచుకున్నారు.

అయితే అతి తక్కువ పెట్టుబడితో ఏడాది మొత్తం పంట దిగుబడుల తీస్తూ.. అధిక లాభాలను పొందాలనుకున్నారు. ఇందుకోసం ప్రకృతి వ్యవసాయం విభాగం సిబ్బంది సహకారంతో పురుగమందులు లేని ప్రకృతి వ్యవసాయ విధానాలను పాటిస్తూ… ప్రణాళిక బద్ధంగా కూరగాయల సాగును మొదలు పెట్టారు. వచ్చిన దిగుబడిని వాట్సాప్ గ్రూప్ ద్వారా మార్కెటింగ్ చేస్తూ.. అధిక లాభాలను ఆర్జిస్తున్నారు

వాట్సాప్ ద్వారా కూరగాయల ఆర్డర్.. ఇంటికే డోర్ డెలివరీ : 
ఆర్గానిక్ పంటలు పండించడమే కాదు స్వయంగా  మోహన రావు కుటుంభమే వినూత్న పద్దతిలో మార్కేటింగ్ కూడా చేస్తున్నారు. పండిచిన కూరగాయలను సూదూర ప్రాంతాలకు పంపించకుండా.. సమీపంలోని నరసన్నపేటలో మన మార్ట్ పేరిట  మార్ట్ ని ప్రారంబిచారు. చూట్టు ప్రక్కల గ్రామాలు , పట్టణాల ప్రజలతో వాట్సాప్ గ్రూపులను ప్రారంభించారు . వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసిన వినియోగదారులకు సహజ సిద్దంగా పండించిన కూరగాయలను  డోర్ డెలివరీ చేస్తున్నారు. ప్రజలనుండి మంచి ఆధరణ లభిస్తోంది.

రైతు 20 ఏకరాలను ఏటీఏం మోడల్ విధానంలో ఇరవై ఇరవై సెంట్లుగా విభజించి .. దుంపజాతి కూరగాయలు ,ఆకు కూరలు , తీగ జాతి కూరగాయలు, కాయగూరల పెంపకం మోదలు పెట్టారు.. దాదాపు 15 నుండి 20 రకాలు పంటను సాగు చేస్తున్నారు. ఈ పంటలకు ఎలాంటి రసాయనాలను వినియోగించడంలేదు. సహాజ సిద్ధంగా తయారుచేసిన ఘన , ద్రవ జీవామృతాలను అందిస్తూ.. చీడపీడలకు కషాయలను పిచికారి చేస్తున్నారు. ఇలా… 365 రోజులు కూరగాయల దిగుబడిని తీసే విధంగా ప్రకృతి వ్యవసాయ విభాగం సభ్యుల సహకారంతో ప్రణాళికలను రూపొందించుకున్నారు.

కూరగాయలు పండించడంలో పాత పద్ధతి పాటిస్తూ.. వాటిని విక్రయించడంలో మాత్రం కొత్త పోకడలు అవలంబిస్తున్నాడు  రైతు మోహనరావు . మార్కెట్‌కు వెళ్లే అవసరం లేకుండా, కూరగాయలు రాశిగా పోసి కొనుగోలు దారుల కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా సెల్‌ఫోన్‌ సాయంతో వ్యాపారం చేస్తూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Read Also : Ground Nut Cultivation : రబీలో వరికి ప్రత్యామ్నాయంగా వేరుశనగ సాగు.. పంటలో చేపట్టాల్సిన యాజమాన్యం