Jasmine Price Drops : మరింత పడిపోయిన మల్లెపూల ధరలు.. కన్నీరు పెడుతున్న రైతులు

Jasmine Price Drops : ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో సుమారు 500 ఎకరాల్లో రైతులు మల్లెపువ్వులు సాగు చేస్తున్నారు. ధరల్లో హెచ్చుతగ్గులు సాగుదారులను నష్టాల్లోకి నెడుతున్నాయి.

Jasmine Price Drops : మరింత పడిపోయిన మల్లెపూల ధరలు.. కన్నీరు పెడుతున్న రైతులు

Jasmine Price Drops

Updated On : February 22, 2024 / 11:48 PM IST

Jasmine Price Drops : మల్లె రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.  ధరలు భారీగా దిగజారడం వారిని కోలుకోలేని దెబ్బతీస్తోంది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ధరల పతనం ప్రారంభమైంది. ఇప్పటి వరకూ పుంజుకోకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది దిగుబడులు   పర్వాలేదనిపించిన.. మార్కెట్ లో ధరలు లేక కనీసం కోత కూలి కూడా రావడం లేదని మల్లె రైతులు వాపోతున్నారు.

Read Also : Sugarcane Cultivation : చెరకు కార్శితోటల యాజమాన్యం.. సాగుతో సమయం, పెట్టుబడి ఆదా

ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో సుమారు 500 ఎకరాల్లో రైతులు మల్లెపువ్వులు సాగు చేస్తున్నారు. ధరల్లో హెచ్చుతగ్గులు సాగుదారులను నష్టాల్లోకి నెడుతున్నాయి. రోజుకో రేటుకి మల్లెపూలు అమ్ముడుపోతున్నాయి. దీంతో గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నారు.

మైలవరం నియోజక వర్గంలో చండ్రగూడెం గ్రామం రైతులు ప్రధాన పంటగా మల్లెపూలు సాగు చేస్తారు. ఈ రైతులంతా స్థానిక మార్కెట్ లో విక్రయిస్తుంటారు.  కూలీలు, ఎరువులు, పురుగుమందులకు పెట్టిన పెట్టుబడి మినహాయిస్తే మల్లెపూల సాగు గిట్టుబాటు కావడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

కౌలు రైతుల పరిస్థితి దుర్భరంగా ఉంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా కౌలు ధరలున్నాయి. ఎకరాకి మూడు నెలలకే లక్ష రూపాయల పైనే కౌలు చెల్లిస్తున్నారు. పెట్టిన పెట్టుబడి, కౌలు తీసేస్తే ఎకరా మల్లెపూల సాగుకి సంవత్సరానికి ఇరవై వేల నుంచి 40వేలు మాత్రమే మిగులుతున్నాయని మల్లెపూలు సాగు చేస్తున్న కౌలు రైతులు చెబుతున్నారు. మల్లెపూల ధర మార్కెట్లో ఒక్కో రోజు ఒక్కోలా ఉండటమే అందుకు కారణమని చెప్తున్నారు.

Read Also : Pest Control in Wheat : గోధుమ పంటలో చీడపీడల ఉధృతి.. నివారణ పద్ధతులు