Pest Control in Wheat : గోధుమ పంటలో చీడపీడల ఉధృతి.. నివారణ పద్ధతులు

Pest Control in Wheat : ఇప్పటికే విత్తన గోదుమ 30 నుండి 45 రోజుల దశలో ఉంది. అయితే గోదుమ పంటలో పురుగుల ఉధృతి పెరిగిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు ఇప్పుడు చూద్దాం..

Pest Control in Wheat : గోధుమ పంటలో చీడపీడల ఉధృతి.. నివారణ పద్ధతులు

Pest Control in Wheat

Pest Control in Wheat : చలికాలంలో మాత్రమే వచ్చే ఆహార పంట గోధుమ. మన దేశంలో అధికంగా ఉత్తర భారత దేశంలో సాగుచేస్తూ ఉంటారు. కానీ తెలంగాణలో చలి ఎక్కువగా ఉండే ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో గోధుమను సాగుచేయటం కనిపిస్తుంది. గోధుమను నేరుగా విత్తిసాగుచేస్తారు. ఇప్పటికే విత్తన గోదుమ 30 నుండి 45 రోజుల దశలో ఉంది. అయితే గోదుమ పంటలో పురుగుల ఉధృతి పెరిగిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు ఇప్పుడు చూద్దాం..

Read Also : Mirchi Cultivation : మిరపను ఆశించే పూత పురుగు నివారణ

తెలంగాణ రాష్ట్రంలో గొధుమ పంటను సాగుచేసే రైతులు చాలా తక్కువ. ఈ పంట చల్లటి వాతావరణంలో పెరిగి అధిక దిగుబడి వస్తుంది. దీనిలో ప్రోటీన్లు, మరియు పీచు పదార్థాలు అధికంగా ఉండటం వల్లన ఆరోగ్యపరంగా అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పుడు ఈ గోధుమ పంట మెదక్‌, ఆదిలాబాద్‌ ,నిజామాబాద్‌ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్నారు.

సాధారణంగా గోధుమను అక్టోబర్‌ 15 నుంచి నవంబర్‌ చివరి వరకు విత్తుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో వేసిన గోధుమ 30 నుండి 45 రోజుల దశలో ఉంది. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా గోదుమ పంటలో పురుగుల ఉధృతి పెరిగింది. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్ రైతులకు తెలియజేస్తున్నారు.

Read Also : Sugarcane Cultivation : చెరకు కార్శితోటల యాజమాన్యం.. సాగుతో సమయం, పెట్టుబడి ఆదా