Fishing Aquaculture : శీతాకాలం చేపలు, రొయ్యల పెంపకంలో మెళకువలు
Fishing and Aquaculture : మంచినీటి చెరువుల్లో చేపల పెంపకం గతంలో కంటే అధికంగా పెరిగింది. తెలంగాణ ప్రాంతంలో కొరమేను చేపల పెంపకం విస్తరించింది.

Fishing and Aquaculture
Fishing And Aquaculture : శీతాకాలంలో చలి తీవ్రతతో ఉష్ణోగ్రత పడిపోవడం మనుషులకే కాదు… చేపలకు కూడా ప్రమాదకరమే. శీతాకాలంలో సాధారణంగా వ్యాధి నిరోధక శక్తి చేపలు, రొయ్యలలో తక్కువగా ఉంటుంది. దీంతో వ్యాధుల బారిన పడి మృత్యువాత పడుతుంటాయి . వీటి నుండి చేపలను రక్షించుకునేందుకు చేపట్టాల్సిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు రిటైర్డ్ శాస్త్రవేత్త డా. చిప్పగిరి జ్ఞానేశ్వర్.
Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు
మంచినీటి చెరువుల్లో చేపల పెంపకం గతంలో కంటే అధికంగా పెరిగింది. తెలంగాణ ప్రాంతంలో కొరమేను చేపల పెంపకం విస్తరించింది. ఇటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలో కొల్లేరు మంచినీటి సరస్సును ఆనుకొని వేల ఎకరాల్లో ఆక్వా పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. రొయ్యలతో పోలిస్తే, చేపల పెంపకంలో ఆదాయం తక్కువ వున్నా, స్థిరమైన రాబడి వుండటం, నష్ట భయం తక్కువ వుండటంతో రైతులు ఈ కల్చర్ వైపు అధిక ఆసక్తి చూపిస్తున్నారు.
మరోవైపు నష్టాల వస్తున్నా రొయ్యల సాగును మాత్రం వదలడం లేదు రైతులు . ప్రధానంగా కట్ల, రోహు చేపలను వాణిజ్య సరళిలో సాగుచేస్తున్నారు. ఎకరానికి 2 వేల నుంచి 2,500 పిల్లను వదులుతున్నారు. వీటితోపాటు చెరువు అడుగుభాగం కాలుష్యం కాకుండా కొరమీను, గ్రాస్ కార్ప్ వంటి చేపలను ఎకరాకు 100 నుంచి 200 వరకు వదులుతారు. గతంలో రెండంగుళాల సైజులో అంటే ఫింగర్ లింగ్ దశలో చేప పిల్ల వదిలేవారు. ఈ పంట వచ్చేందుకు 12 నెలల సమయం పట్టేది.
ప్రస్థుతం జీరో పాయింట్లు అంటే 180 నుంచి 250 గ్రాముల సైజులో పిల్లలను వదులుతున్నారు. దీనివల్ల కల్చర్ పంటకాలం తగ్గి రెండేళ్లకు 3 నుంచి 4 పంటలు తీసే అవకాశం ఏర్పడింది. అయితే శీతాకాలంలో రైతులు చేపల సాగులో ఎక్కువ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. వాతావరణంలోని తీవ్ర హెచ్చుతగ్గులు, తరచూ చెరువు నీటి ఉష్ణోగ్రతలు పడిపోవటం వల్ల చెరువుల్లో తరచూ ప్రాణవాయువు కొరత ఏర్పడుతోంది. ఈ పరిస్థితుల్లో చెరువుల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు రిటైర్డ్ శాస్త్రవేత్త డా. చిప్పగిరి జ్ఞానేశ్వర్ .
చేపలు ఒత్తిడికి లోనవటం వల్ల వివిధ వ్యాధులబారిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో చేపల చెరువుల్లో చేపట్టాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు డా. చిప్పగిరి జ్ఞానేశ్వర్, రిటైర్డ్ శాస్త్రవేత్త చేపల కల్చర్ కు, గడ్డుకాలం ఈ శీతాకాలం. చేపలు ఒత్తిడికి లోనవటం వల్ల వివిధ వ్యాధులబారిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో చెరువుల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. ఏమాత్రం ఒడిదుడుకులు ఎదురైనా రైతు భరించలేని స్థాయిలో నష్టం సంభవిస్తుంది. అడుగడుగునా అప్రమత్తంగా మెలగాల్సిన అవసరం వుంది.