Ginger Varieties : ఖరీఫ్ కు అనువైన అల్లం రకాలు.. అధిక దిగుబడికోసం మేలైన యాజమాన్యం

ముఖ్యంగా అల్లం పంటకు తేమతో కూడిన వేడి వాతావరణం అవసరం.  బరువైన బంకమట్టి నేలలు, రాతి నేలలు పనికిరావు. మురుగునీటి పారుదల చాలా అవసరం.  ఏజెన్సీలో ఎక్కువగా పండించే వాటిల్లో నర్సీపట్నం, నడియ, తుని స్థానిక రకాలున్నాయి.

Ginger Varieties : ఖరీఫ్ కు అనువైన అల్లం రకాలు.. అధిక దిగుబడికోసం మేలైన యాజమాన్యం

Ginger varieties

Ginger Varieties : ఔషధ, సుగంధ ద్రవ్యపంటగా అల్లం ప్రాధాన్యత నానాటికి పెరుగుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది  సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అల్లం సాగుకు అన్ని ప్రాంతాలు అనుకూలం కాదు. దీనివల్ల  కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ పంటసాగులో గత 3 సం.లుగా  రైతులు ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపికతో పాటు, మేలైన యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా, కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. సత్తిబాబు

READ ALSO : Organic Farming : సేంద్రీయ రైతుల హోటల్.. ఇక్కడ తింటే ఆరోగ్యం పదిలం

అల్లం ఉత్పత్తిలో భారతదేశం 32.75శాతంతో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. అల్లం సుగంధ ద్రవ్యంగా ప్రసిద్ధి చెందింది. తాజా అల్లాన్ని వంటకాల్లో అదికంగా వాడుతారు. పచ్చి అల్లం మీద ఉన్న పొట్టు తీసి సున్నపు నీటితో శుద్ధి చేసి ఎండబెట్టిన అల్లాన్ని శొంఠి అంటారు. దీన్ని ఉదర సంబంధమైన వ్యాధులకు ఉపయోగిస్తారు. ఎండబెట్టిన అల్లాన్ని పొడిగా చేసి వివిధ పదార్థాల తయారీకి ఉపయోగిస్తారు. అందుకే అల్లానికి అంత డిమాండ్.

READ ALSO : Seeds Germination : విత్తనాల్లో మొలక శాతం తెలుసుకోండి ఇలా..

ముఖ్యంగా అల్లం పంటకు తేమతో కూడిన వేడి వాతావరణం అవసరం.  బరువైన బంకమట్టి నేలలు, రాతి నేలలు పనికిరావు. మురుగునీటి పారుదల చాలా అవసరం.  ఏజెన్సీలో ఎక్కువగా పండించే వాటిల్లో నర్సీపట్నం, నడియ, తుని స్థానిక రకాలున్నాయి. చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో పరిశోధనలు జరిపిన అధిక దిగుబడులనిచ్చే అల్లం రకాలను ఏజన్సీ రైతులు పండిస్తున్నారు.

READ ALSO : Ginger Cultivation : అల్లం సాగులో సస్యరక్షణ, చీడపీడల నివారణ!

అయితే ఇక్కడి సంప్రదాయ పద్ధతిలో సాగుచేయడం వల్ల, ఆశించిన దిగుబడిని పొందలేకపోతున్నారు. అధిక దిగుబడిని సాధించాలంటే రకాల ఎంపికతో పాటు , ప్రోట్రే విధానంలో పెంచిన నారును నాటుకొని , మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లైతే అధిక దిగుబడిని పొందవచ్చని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా, కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. సత్తిబాబు.