Groundnut Cultivation : రబీకి వేరుశనగ రకాలు సాగులో మెళకువలు
Groundnut Cultivation : తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఖరీఫ్ వరి కోతల తర్వాత రబీలో రైతులు వేరుశనగను సాగుచేయటం ఆనవాయితీగా వుంది.

Groundnut Cultivation In Rabi
Groundnut Cultivation : నూనెగింజల పంటల్లో ప్రధానమైనపంట వేరుశనగ. ముఖ్యంగా రబీలో నీటి వసతి కింద ఈ పంటను రాయలసీమ, ఉత్తరాంధ్ర , తెలంగాణ జిల్లాలో అధికంగా సాగుచేస్తున్నారు. ఖరీఫ్ తో పోలిస్తే రబీ వేరుశనగలో సమస్యలు తక్కువ. అయితే ఆయా ప్రాంతాలకు అనుగుణంగా రైతులు రకాల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటిస్తే మంచి దిగుబడులను సాధించవచ్చని సూచిస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్త, డా. వెంకటేశ్వర రావు.
తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఖరీఫ్ వరి కోతల తర్వాత రబీలో రైతులు వేరుశనగను సాగుచేయటం ఆనవాయితీగా వుంది. రబీలో వేరుశనగను నీటి వసతి కింద సాగు చేస్తారు కనుక ఖరీఫ్ కంటే ఎక్కువ దిగుబడులు నమోదుచేస్తున్నారు. తేలిక నేలలు ఎర్రచెల్కా నేలల్లో రైతులు వేరుశనగ సాగుకు మొగ్గుచూపుతున్నారు.
ఒక్క తెలంగాణలోనే 1లక్షా 80 వేల హెక్టార్లలోల వేరుశనగ సాగవుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అక్టోబర్ 15 వరకు , దక్షిణ తెలంగాణలో నవంబర్ 15 వరకు విత్తుకునే అవకాశం ఉంది. అయితే ఆయా ప్రాంతలకు అనువైన రకాల ఎంపికతో పాటు సరైన సాగు పద్ధతులను పాటిస్తే మంచి దిగుబడులను తీసే అవకాశం ఉంటుంది. వేరుశనగ సాగులో సమగ్ర యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్త, డా. వెంకటేశ్వర రావు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
వేరుశనగలో ఎరువుల యాజమాన్యం, కలుపు నివారణ చాలా ముఖ్యమైనది. సమయానుకూలంగా సిఫారసు మేరకు ఎరువులను వేసి, పంట విత్తిన 48 గంటల్లోనే కలుపు నివారణ చర్యలు చేపట్టినట్లైతే మున్ముందు సమస్యలు తలెత్తవు. అలాగే ఈ పంటకు సమయానుకూలంగా పోషకాలను అందించాలి.
వేరుశనగ పంట పెరుగుదల దశలో రైతు చీడపీడలపై తగిన నిఘా వుంచాలి. పంట విత్తిన తరువాత , పంట దశను బట్టి ఆశించే పురుగులు,తెగుళ్లను బట్టి వెంటనే తగిన నివారణ చర్యలు చేపట్టాలి. వేరుశనగ పంటకు నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యం . పంట విత్తిన 30 రోజుల నుండి 90 రోజుల వరకు అంటే ఊడదిగే దశనుండి కాయ ఊరే దశ కీలకమైనది కాబట్టి ఈ సమయంలో సరైన నీటి తడులను అందించినట్లైతే దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది.
Read Also : Coconut Cocoa Plantation : కొబ్బరి, కోకో తోటలో ఆరుతడిపంటగా వరిసాగు