Groundnut Cultivation : రబీ వేరుశనగ సాగుకు సిద్ధమవుతున్న రైతులు – అధిక దిగుబడులకోసం మేలైన రకాలు

Groundnut Cultivation : పాత రకాల స్థానంలో ప్రస్థుతం అధిక దిగుబడినిచ్చే అనేక నూతన రకాలు అందుబాటులో వున్నాయి. ఉత్తర కోస్తా రైతులు ఎలాంటి రకాలను ఎంచుకోవాలో తెలియజేస్తున్నారు..

Groundnut Cultivation : రబీ వేరుశనగ సాగుకు సిద్ధమవుతున్న రైతులు – అధిక దిగుబడులకోసం మేలైన రకాలు

Groundnut Cultivation

Updated On : January 2, 2025 / 2:16 PM IST

Groundnut Cultivation : నూనెగింజల పంటల్లో ప్రధానమైన పంట వేరుశనగ. తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగుచేస్తూ ఉంటారు రైతులు.  ప్రాంతాన్నిబట్టి, ఆయా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రబీ వేరుశనగను నవంబర్ నుండి డిసెంబర్ 15 వరకు సాగుచేస్తారు.

Read Also : AP Agriculture Budget: ఏపీ అగ్రికల్చర్ బడ్జెట్ రూ.43,402 కోట్లు.. కేటాయింపులు ఇలా..

ముఖ్యంగా పాత రకాల స్థానంలో ప్రస్థుతం అధిక దిగుబడినిచ్చే అనేక నూతన రకాలు అందుబాటులో వున్నాయి. ఉత్తర కోస్తా రైతులు ఎలాంటి రకాలను ఎంచుకోవాలో తెలియజేస్తున్నారు.. యలమంచిలి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శీరీష రైతాంగానికి తెలియజేస్తున్నారు.

వేరుశనగ వర్షాధార పంట కనుక  ఖరీఫ్ లో ఏటా ఈ పంటను వాతావరణ ఒడిదుడుకులు, బెట్ట పరిస్థితులు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. అయితే రబీకాలంలో వాతావరణం కొంత స్థిరంగా వుండటం, నీటి వసతి కింద సాగుచేయటం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి.  ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరకోస్తా, దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లో రబీ వేరుశనగ సాగవుతోంది. ఉత్తరకోస్తాలో, దక్షిణ రాయలసీమలో నవంబరు నుంచి డిసెంబరు వరకు ఈపంటను విత్తుకోవటానికి అనుకూలం.

ఇసుకతోకూడిన గరపనేలలు, నీరు ఇంకే స్వభావం వున్న ఎర్రచల్కానేలలు ఈ పంటసాగుకు శ్రేష్ఠమైనవి. అయితే అధిక దిగుబడులు సాధించాలంటే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా పాత రకాల స్థానంలో అధిక దిగుబడినిచ్చే అనేక రకాలు అందుబాటులోకి వచ్చాయి. వాటి వివరాలు తెలియజేస్తున్నారు అనకాపల్లి జిల్లా, యలమంచిలి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శీరీష.

Read Also : Agri Info : ఏ గ్రేడ్ మోడల్‎లో వరి‎గట్లపై కూరగాయల సాగు