AP Agriculture Budget: ఏపీ అగ్రికల్చర్ బడ్జెట్ రూ.43,402 కోట్లు.. కేటాయింపులు ఇలా..

62శాతం జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉందని, గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని గాలికొదిలేసిందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.

AP Agriculture Budget: ఏపీ అగ్రికల్చర్ బడ్జెట్ రూ.43,402 కోట్లు.. కేటాయింపులు ఇలా..

Minister Atchannaidu

Updated On : November 11, 2024 / 1:29 PM IST

Minister Kinjarapu Atchannaidu: ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం వ్యవసాయశాఖ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.43,402 కోట్లతో అగ్రికల్చర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 62శాతం జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉందని, గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం హయాంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భూసార పరీక్షలకు తిరిగి ప్రాధాన్యతను ఇస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా రైతుల ఆర్థికాభివృద్ధికోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించారు.

Also Read: AP Budget 2024: ఏపీ బడ్జెట్ రూ.2.94లక్షల కోట్లు.. పలు రంగాలకు కేటాయింపులు ఇలా..

కేటాయింపులు ఇలా..
రాయితీ విత్తనాలకు రూ.240 కోట్లు
అన్నదాత సుఖీభవ రూ.4,500 కోట్లు.
భూసార పరీక్షలకు రూ.38.88 కోట్లు.
విత్తనాల పంపిణీ రూ.240 కోట్లు.
ఎరువుల సరఫరా రూ.40 కోట్లు.
పొలం పిలుస్తోంది రూ.11.31కోట్లు.
ప్రకృతి వ్యవసాయంకు రూ.422.96 కోట్లు.
డిజిటల్ వ్యవసాయంకు రూ.44.77కోట్లు.
వ్యవసాయ యాంత్రీకరణకు రూ.187.68 కోట్లు.
వడ్డీ లేని రుణాలకు రూ.628కోట్లు.
రైతు సేవా కేంద్రాలకు రూ.26.92కోట్లు.
ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ రూ.44.03 కోట్లు.
పంటల బీమా పథకానికి రూ.1,023 కోట్లు.
వ్యవసాయ శాఖ రూ.8,564.37కోట్లు.
ఉద్యానవన శాఖ రూ.3469.47 కోట్లు.
పట్టు పరిశ్రమ రూ.108.4429 కోట్లు.
వ్యవసాయ మార్కెటింగ్ రూ.314.80 కోట్లు.
సహకార శాఖ రూ.308.26 కోట్లు.
ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంకు రూ.507.038 కోట్లు.
ఉద్యాన విశ్వవిద్యాలయంకు రూ.102.227 కోట్లు.
శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయంకు రూ.171.72 కోట్లు.
మత్స్య విశ్వవిద్యాలయం రూ.38కోట్లు.
పశుసంవర్ధక శాఖ రూ.1,095.71 కోట్లు.
మత్స్య రంగం అభివృద్ధి కోసం రూ.521.34 కోట్లు.
ఉచిత వ్యవసాయ విద్యుత్ రూ.7241.30 కోట్లు.
ఉపాధి హమీ అనుసంధానం రూ.5,150 కోట్లు.
ఎన్టీఆర్ జలసిరి రూ.50కోట్లు.
నీరుపారుదల ప్రాజెక్టుల నిర్వహణ రూ.14,637.03 కోట్లు.