Pest Control : కంది పంటలో చీడపీడల ఉధృతి..నివారణ చర్యలు
ఖరీఫ్ కంది పంటకాలం, సాగుచేసిన రకాన్నిబట్టి 150 నుండి 180 రోజులు. ఈ సారి రుతుపవనాలు కూడా సకాలంలో రావడంతో సమయానికి కందిని విత్తారు. ప్రస్తుతం పంట శాకీయ దశనుండి పూత దశలో ఉంది. అయితే ఈ సున్నత సమయంలో రైతులు చాలా జగ్రత్తగా ఉండాలి.

Pest Control
Pest Control : ఖరీఫ్ లో సాగుచేసిన కంది, వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం పూత, పిందె దశలో ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు కందిలో చీడపీడల ఉదృతి పెరింగింది. ఈ సున్నిత దశలో ఎండుతెగులు, ఎండుతెగులు , మారుకామచ్చల పురుగు, శనగపచ్చపురుగులు ఆశించిన తీవ్రనష్టం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు నాగర్ కర్నూల్ జిల్లా , ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డా. రామకృష్ణ బాబు.
READ ALSO : Gongura Cultivation : లాభాలు పండిస్తున్న గోంగూర సాగు
ఖరీఫ్ కంది పంటకాలం, సాగుచేసిన రకాన్నిబట్టి 150 నుండి 180 రోజులు. ఈ సారి రుతుపవనాలు కూడా సకాలంలో రావడంతో సమయానికి కందిని విత్తారు. ప్రస్తుతం పంట శాకీయ దశనుండి పూత దశలో ఉంది. అయితే ఈ సున్నిత సమయంలో రైతులు చాలా జగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కాయతొలిచే పురుగు, మారుకామచ్చలపురుగు, ఆకుచుట్టు పురుగు, శనిగపచ్చపురుగు, ఈక రెక్కలపురుగు ఆశించే అవకావం ఉంది.
READ ALSO : Types Of Soils : ఏ నేలల్లో ఏఏ పంటలు సాగుచేయాలి ? నేలల రకాలు.. పంటల ఎంపిక
వీటి వల్ల పంట తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు పంటను గమనిస్తుండాలి. పురుగుల ఉధృతిని గమనించినట్లైతే నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు నాగర్ కర్నూల్ జిల్లా , ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డా. రామకృష్ణ బాబు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా అక్కడక్కడ చేలలో నీరు నిలిచి ఎండుతెగులు, ఫైటోఫ్తోరా తెగులు ఆశించాయి. తద్వారా పంట మొత్తం ఎండిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు చూద్దాం..