Cotton Cultivation : పత్తిసాగులో రైతులకు పాటించాల్సిన సూచనలు

Cotton Cultivation : ఖరీఫ్ పత్తి సాగుకు సిద్దమవుతున్న రైతులు తొలిదశలో ఆశించే చీడపీడల నివారణకు, ఎరువుల యాజమాన్య పద్ధతులు ఎలా చేపట్టాలో తెలియజేస్తున్నారు.

Cotton Cultivation : పత్తిసాగులో రైతులకు పాటించాల్సిన సూచనలు

Instructions for Cotton Cultivation

Updated On : June 20, 2024 / 3:02 PM IST

Cotton Cultivation : ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. విత్తనాలు విత్తేందుకు.. రైతులు భారీ వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారంగా పండే ప్రధాన పంటల్లో పత్తిదే సింహభాగం. ఖరీఫ్ పత్తి సాగుకు సిద్దమవుతున్న రైతులు తొలిదశలో ఆశించే చీడపీడల నివారణకు, ఎరువుల యాజమాన్య పద్ధతులు ఎలా చేపట్టాలో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ప్రవీణ్ కుమార్.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు  

తెలుగురాష్ట్రాల్లో వర్షాధారంగా అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట పత్తి. ఈ పంట సాగులో అనేక సమస్యలు వున్నా.. వర్షాధారంగా సాగయ్యే ఇతర పంటలకంటే మంచి ఫలితాలు ఇస్తుండటం వల్ల ఏటా దీని సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ప్రస్తుతం పంట విత్తేందుకు సిద్ధమవుతున్న రైతులు.. ఎప్పుడు విత్తుకోవాలి.. ఎరువుల యాజమాన్యం, తొలిదశలో వచ్చే చీడపీడల నివారణ ఏవిధంగా చేపట్టవచ్చో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ప్రవీణ్ కుమార్.

Read Also : Layer Chickens : లేయర్ కోళ్ల పెంపకంతో లాభాలు ఆర్జిస్తున్న రైతు