Cultivation Of Maize : తెలంగాణలో అధిక విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు.. ఖరీఫ్ లో అధిక దిగుబడినిచ్చే మేలైన రకాలు

జూన్ మొదటి వారంలో అయితే ధీర్ఘకాలిక రకాలను సాగుచేసుకోవచ్చు. జూన్ చివరిలో మధ్యకాలిక రకాలను సాగుచేసుకోవాలి. ఆలస్యమైన ప్రాంతాల్లో స్వల్పకాలిక రకాలను వేసుకోవాలని సూచిస్తున్నారు  రాజేంద్రనగర్ మొక్కజొన్న పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త  డా. నగేష్ కుమార్.

Cultivation Of Maize : తెలంగాణలో అధిక విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు.. ఖరీఫ్ లో అధిక దిగుబడినిచ్చే మేలైన రకాలు

Maize Varieties

Cultivation Of Maize : మొక్కజొన్న మంచి ఆదాయాన్ని ఇచ్చే పంటగా రైతుల ఆదరణ పొందుతోంది. తక్కువ పంట కాలం.. దిగుబడి ఎక్కువగా వస్తుండడంతో చాలా మంది రైతులు, ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని రైతులు వేసుకోవాల్సిన మధ్య, స్వల్పకాలిక రకాల గురించి తెలియజే సూచిస్తున్నారు  రాజేంద్రనగర్ మొక్కజొన్న పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. నగేష్ కుమార్. మరి ఆవివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

READ ALSO : Maize Farming : రైతుకు మంచి అదాయవనరుగా మొక్కజొన్నసాగు !

వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక , దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగించడం జరుగుతుంది.  వర్షపాతం ఆధారంగా, సాగునీటికింద మొక్కజొన్నను విత్తుతున్నారు. అయితే  ఏటా జూన్ మొదటి వారంలోనే వర్షాలు పడుతుంటాయి. వర్షం పడిన వెంటనే మొక్కజొన్నను రైతులు సాగుచేస్తుంటారు.

READ ALSO : Coriander Cultivation : కొబ్బరిలో అంతర పంటగా కొత్తిమీర సాగు.. తక్కువ సమయంలోనే అధిక లాభాలు ఆర్జిస్తున్న రైతు

జూన్ మొదటి వారంలో అయితే ధీర్ఘకాలిక రకాలను సాగుచేసుకోవచ్చు. జూన్ చివరిలో మధ్యకాలిక రకాలను సాగుచేసుకోవాలి. ఆలస్యమైన ప్రాంతాల్లో స్వల్పకాలిక రకాలను వేసుకోవాలని సూచిస్తున్నారు  రాజేంద్రనగర్ మొక్కజొన్న పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త  డా. నగేష్ కుమార్. అయితే ఆ రకాలు , వాటి గుణగణాలేంటే ఆయన ద్వారానే తెలుసుకుందాం..