Mango Cultivation : మామిడిలో పూత సమయంలో చేపట్టాల్సిన యాజమాన్యం

Mango Cultivation : సంవత్సరం పొడవునా తోటల్లో మనం చేపట్టే యాజమాన్య పద్ధతులు ఒక ఎత్తయితే, పూత సమయంలో పాటించే యాజమాన్యం ఒకఎత్తు. ఈ దశలో తోటల్లో పురుగులు, తెగుళ్లు, ఆశించకుండా  రైతులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

Mango Cultivation : మామిడిలో పూత సమయంలో చేపట్టాల్సిన యాజమాన్యం

Mango Cultivation

Updated On : December 18, 2023 / 3:33 PM IST

Mango Cultivation : ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో మామిడితోటల్లో పూత ప్రారంభమైంది. మరికొన్నితోటల్లో ఇంకా పూత ప్రారంభం కావాల్సివుంది. సంవత్సరం పొడవునా తోటల్లో మనం చేపట్టే యాజమాన్య పద్ధతులు ఒక ఎత్తయితే, పూత సమయంలో పాటించే యాజమాన్యం ఒకఎత్తు. ఈ దశలో తోటల్లో పురుగులు, తెగుళ్లు, ఆశించకుండా  రైతులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే పూత ప్రారంభమయ్యే సమయంలో రైతులు సకాలంలో తగిన యాజమాన్య చర్యలు చేపట్టాలంటూ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

మామిడి తోటల్లో ప్రారంభమైన పూత : 
పండ్ల తోటల విస్తీర్ణంలో సగానికి సగం మామిడే.  తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 లక్షల 8 వేల  హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు  అనుకూలంగా వుండటంతో  రైతుల్లో ఉత్సాహం నింపుతోంది. కొన్ని తోటల్లో ఇప్పటికే పూత వచ్చింది. మరికొన్ని తోటల్లో ఇప్పుడిప్పుడే వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా పూత ప్రారంభం కాలేదు. అయితే మామిడిలో పూత, పిందే కాపాడుకోవడం ఎంత ముఖ్యమో.. అవి కాయగా మారి, మంచి దిగుబడి వచ్చేందుకు సకాలంలో ఎరువులు వేయడము కూడా అంతే ముఖ్యం.

Read Also : Areca Nut Cultivation : వక్కసాగుతో లాభాలు ప‌క్కా అంటున్న రైతు

మొక్కల వయస్సును బట్టి సకాలంలో శాస్త్రవేత్తల సూచనల మేరకు ఎరువులను అందించాలి. ఎరువుల, కలుపు నీటియాజమాన్యం సకాలంలో చేపట్టినా.. పూత సమయంలో  పురుగుల ఉధృతి అధికంగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని గమనిస్తూ..  సమగ్ర నివారణ చర్యలు చేపట్టాలి. మామిడి పూతను కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం .

* పశువుల ఎరువుతో కలిపి
అజటోబ్యాక్టర్ 250 గ్రా. పాస్ఫోబ్యక్టీరియా 100 గ్రా.

* సూక్ష్మపోషకాల లోపం నివారణ
పూతకు ముందే  పోటాషియం నైట్రేట్ 10 గ్రా. జింక్ 3-5 గ్రా.

* పోషకాల లోపం నివారణ
బోరాన్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి

* రసంపీల్చే పురుగుల నివారణ
వేపనూనె 5 మి. లీ. లేదా అజాడిరక్టిన్ 1000 పిపిఎం 1 మి. లీ.
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి

* తేనెమంచు పురుగుల నివారణ
వేపనూనె 5 మి. లీ. లేదా అజాడిరక్టిన్ 1000 పిపిఎం 1 మి. లీ.
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి

* తేనెమంచు పురుగుల నివారణ
ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి. లీ లేదా ఎసిఫేట్ లేదా థయోమిథాక్సామ్ మార్చి మార్చి కొట్టాలి

* తామర పురుగుల నివారణ
ఫిప్రోనిల్  2 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి

Read Also : Aqua Farmers Problems : రొయ్య రైతుకు అకాల కష్టం.. ఆశాజనకంగా లేని వనామి రొయ్యల సాగు