Mango Cultivation : ప్రస్తుతం మామిడిలో ఆశించే పురుగుల నివారణ

Mango Cultivation : మామిడి పండ్లలో రారాజు. మామిడి పూత నవంబర్, నుండి జనవరి మధ్య మొదలై ఫిబ్రవరి నెల వరకు వస్తుంది.

Mango Cultivation : ప్రస్తుతం మామిడిలో ఆశించే పురుగుల నివారణ

Mango Cultivation

Updated On : January 12, 2025 / 10:21 PM IST

Mango Cultivation : ప్రతికూల వాతావరణంతో పాటు చీడపీడల దాడులతో మూడేండ్లుగా మామిడి రైతులు నష్టాలు చవి చూస్తున్నారు. కాబట్టి ఈ ఏడాదైనా మంచి దిగుబడులను సాధించాలంటే పూత దశ నుంచే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మామిడి తోటల్లో పూత ప్రారంభమైంది. ఈ సమయంలో ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు నూజివీడు ఉద్యాన అధికారి హేమ.

Read Also : Agri Info : ఏ గ్రేడ్ మోడల్‎లో వరి‎గట్లపై కూరగాయల సాగు

మామిడి పండ్లలో రారాజు. మామిడి పూత నవంబర్, నుండి జనవరి మధ్య మొదలై ఫిబ్రవరి నెల వరకు వస్తుంది. దాదాపు 8 నెలల పాటు చేసే యాజమాన్య పద్ధతులు ఒక ఎత్తయితే పూత నుంచి కోత వరకు అనగా దాదాపు 4 నెలల పాటు చేపట్టే సమగ్ర యాజమాన్యం  మరో ఎత్తు. మామిడిలో పూతంతా ఒకేసారి రాకుండ దశలుగా ఉంటుంది.

దీంతో సుమారుగా ఒక నెల మొత్తం పూత కాలం ఉంటుంది. పూత ఒకేసారి రాకపోవడం వలన మామిడిలో సస్యరక్షణ చర్యలు చేయడం, కాత సమయంలో వివిధ దశలలో పండ్లు ఉండడం వలన రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి పూత, కాత మొదలైన తర్వాత సస్యరక్షణ చేయడం సరైన పద్ధతి కాదు, ఒక వేళా చేసిన దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది.

పూతకు కొన్ని రోజుల ముందు నుండి తోటను గమనిస్తూ ఉండాలి. అయితే మామిడి పంటలో పూతదశే కీలకం. పూతను రక్షించుకుంటేనే ఆశించిన దిగుబడి వస్తుంది. అయితే పూత నుండి కాయ దశలో పురుగులు అధికంగా ఆశిస్తు ఉంటాయి.  వీటిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని రైతులకు తెలియజేస్తున్నారు ఏలూరు జిల్లా, నూజివీడు మండలం ఉద్యాన అధికారి హేమ.

Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు