Marigold Cultivation : బంతిసాగులో అధిక దిగుబడుల కోసం సాగులో చేపట్టాల్సిన యాజమాన్యం

పూలలో బంతి ముఖ్యమైంది. వివిధ రంగుల్లో పలు రకాల విత్తనాలు మార్కెట్ లో అందుబాటులోకి రావడం, ఇటు ప్రజలు కూడా శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో  మార్కెట్లో డిమాండ్ పెరిగింది.

Marigold Cultivation : బంతిసాగులో అధిక దిగుబడుల కోసం సాగులో చేపట్టాల్సిన యాజమాన్యం

Marigold Cultivation

Updated On : October 14, 2023 / 3:40 PM IST

Marigold Cultivation : తెలుగు రాష్ట్రాల్లో  అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పూల సంట బంతి. పండుగలు, శుభకార్యాల సమయంలో ఈ పూలకు అధిక డిమాండు ఉంటుంది. అంతే కాదు ఎక్కువ కాలం నిల్వ స్వభావం ఉండటంతో రైతులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపుతున్నారు.  అయితే సరైన ప్రణాళిక లేకపోవడం, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించక పోవడంతో  అనుకున్న దిగుబడులను తీయలేకపోతున్నారు. బంతిపూల సాగులో నాణ్యమైన అధిక దిగుబడులను ఏవిధంగా సాధించాలో తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సరిత.

READ ALSO : Home : గుమ్మం ముందు విడిచిన చెప్పులు తిరగబడి ఉంటే ఎన్ని అనర్ధాలో తెలుసా…?

పూలలో బంతి ముఖ్యమైంది. వివిధ రంగుల్లో పలు రకాల విత్తనాలు మార్కెట్ లో అందుబాటులోకి రావడం, ఇటు ప్రజలు కూడా శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో  మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ఏడాది పొడవునా సాగుచేసే అవకాశం ఉండటంతో సాగు విస్తీర్ణం కూడా ఏ ఏటికాయేడు పెరుగుతూనే ఉంది. అయితే రైతులు సరైన దిగుబడులను తీయలేకపోతున్నారు.

READ ALSO : Somireddy ChandraMohan Reddy : శిశుపాలుడివి వంద తప్పులు,జగన్‌వి వెయ్యి తప్పులు .. దేవుడున్నాడు జాగ్రత్త : సోమిరెడ్డి

బంతి పంటకాలం 120రోజులు. నాటిన 55రోజులనుంచి పూలదిగుబడి ప్రారంభమవుతుంది. ప్రస్థుతం చాలామంది రైతులు ఎకరాకు 20 నుండి 30 క్వింటాళ్ల పూల దిగుబడిని మాత్రమే తీస్తున్నారు. కానీ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే  ఎకరాకు 50 నుండి 100 క్వింటాల వరకు దిగుబడి సాధించవచ్చు . బంతిలో అధిక దిగుబడి కోసం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సరిత.