Bean Crop Cultivation : శనగ పంటలో శనగపచ్చ పురుగు నివారణ
Bean Crop Cultivation : రబీకాలంలో సాగయ్యే పప్పుధాన్యపు పంటల్లో అతి ముఖ్యమైంది శనగ. శనగ విత్తుకోవటానికి అక్టోబరు నుండి నవంబరు 15 వరకు అనుకూలం.

Pest Control in bean Crop Cultivation Telugu
Bean Crop Cultivation : మంచును తేమగా ఉపయోగించుకుని శీతాకాలంలో అధిక దిగుబడినిచ్చే పప్పుధాన్యం శనగ. ఉమ్మడి రాష్ట్రాల్లో రబీ పంటగా శనగ సాగు దాదాపు 6 లక్ష హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతోంది. చల్లని వాతావరణంలో మంచి పెరుగుదలను కనబరిచే ఈ పంటను చాలా చోట్ల విత్తారు.
ఆలస్యమైన ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు. అయితే చీడపీడల (Bean Crop Cultivation) నివారణకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్.
రబీకాలంలో సాగయ్యే పప్పుధాన్యపు పంటల్లో అతి ముఖ్యమైంది శనగ. వాణిజ్యపంటలైన ప్రత్తి, మిరప, పొగాకు పంటలకు ప్రత్యామ్నాయ పంటగా శనగ రైతుల ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా నీటి వసతి తక్కువ వుండే నల్లరేగడి భూముల్లో రబీపంటగా మంచును ఉపయోగించుకుని పెరగ గల పంట ఇది. శనగ విత్తుకోవటానికి అక్టోబరు నుండి నవంబరు 15 వరకు అనుకూలం.
ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్ లో 4 నుండి 5 లక్షల హెక్టార్లలో సాగవుతుండగా, తెలంగాణలో మాత్రం 1 లక్షా 20 వేల హెక్టార్లలోనే సాగవుతుంది. అయితే ఇప్పటికే వేసిన రైతులు.. ప్రస్తుతం వేస్తున్న రైతులు చీడపీడల పట్ల జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా తెగులళ్ళు, పురుగులు ఆశించి పంటకు తీవ్రనష్టం చేస్తాయని వాటి నివారణకు సమగ్ర సస్యరక్షన చర్యల గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్.
Read Also : Sustainable Agriculture : స్టార్టప్‌లతోనే సుస్థిర వ్యవసాయం