Kandi Cultivation : కందిలో పెరిగిన చీడపీడల ఉధృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
Kandi Cultivation : ఈ పురుగుల వల్ల పూత, పిందె నాశనమవటం కనిపిస్తోంది. వీటితో పాటు అక్కడక్కడ ఎండుతెగులు సోకినట్లు శాస్త్రవేత్తలు గమనించారు.

Pest Control in Kandi Cultivation
Kandi Cultivation : మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ కందిలో పురుగుల ఉధృతి (Kandi Cultivation) పెరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో కంది కాయ దశలో ఉండగా, ఆలస్యంగా విత్తిన ప్రాంతాల్లో పూత దశకు చేరుకుంది.
రసం పీల్చే పురుగైన పేనుబంక తాకిడివల్ల నష్టం అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు సత్వరమే చేపట్టాల్సిన , సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్జాన కేంద్రం శాస్త్రవేత్త డా. శ్రీనివాసరెడ్డి .
అపరాల పంటల్లో కందిది ప్రత్యేక స్థానం. దీనిని ఏకపంటగానే కాక పలుపంటల్లో అంతర, మిశ్రమ పంటగా సాగుచేసుకునే అవకాశం వుండటంతో చాలా మంది ఈ ఖరీఫ్ లో సాగుచేశారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో పూత, కాత దశలో ఉంది. అయితే చల్లని వాతావరణ పరిస్థితుల కారణంగా రసం పీల్చే పురుగులైన పేనుబంక, తామరపురుగులతో పాటు ఆకుగూడు, మారుకామచ్చల పురుగులు పంటకు తీవ్రనష్టం కలగజేస్తున్నాయి.
ఈ పురుగుల వల్ల పూత, పిందె నాశనమవటం కనిపిస్తోంది. వీటితో పాటు అక్కడక్కడ ఎండుతెగులు సోకినట్లు శాస్త్రవేత్తలు గమనించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్జాన కేంద్రం శాస్త్రవేత్త డి. శ్రీనివాసరెడ్డి.
Read Also : Fishing Aquaculture : శీతాకాలం చేపలు, రొయ్యల పెంపకంలో మెళకువలు