Rice-Cotton Crop : వరి, పత్తిలో పురుగుల నివారణ

Rice-Cotton Crop : గత కొన్ని రోజులుగా బెట్టకు గురైన పత్తిచేలు, ఇటీవల కురిసిన వర్షాలకు కుదురుకున్నాయి. అయితే అక్కడక్కడ చీడపీడలు ఆశించి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.

Rice-Cotton Crop : వరి, పత్తిలో పురుగుల నివారణ

Pest Control in Rice and Cotton

Updated On : September 18, 2024 / 10:49 PM IST

Rice-Cotton Crop : అడపా దడప కురుస్తున్న వర్షాలు.. ఉక్కపోత లాంటి విభిన్న వాతావరణ పరిస్థితుల కారణంగా వరి, పత్తి పంటల్లో పురుగుల తాకిడి పెరిగింది. వివిధ దశల్లో ఉన్న ఈ పంటలను కాపాడుకోవాలంటే రైతులు ప్రస్తుతం చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు.

గత కొన్ని రోజులుగా బెట్టకు గురైన పత్తిచేలు, ఇటీవల కురిసిన వర్షాలకు కుదురుకున్నాయి. అయితే అక్కడక్కడ చీడపీడలు ఆశించి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా రసంపీల్చే పురుగుల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల  ఆకులు రంగు మారిపోయి, మొక్కలు సరిగా ఎదగటంలేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. వీటితో పాటు గులాబీరంగు పురుగు కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు.

తెలుగు రాష్ట్రాల్లో నీటి వసతి ఉన్నచోట రైతులు వరి సాగు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికీ నాట్లు వేస్తుండగా, మరికొన్ని చోట్ల పిలక, దుబ్బు దశలో ఉంది. వరి పైరులో కాండం తొలుచు పురుగు నారుమడి దశ నుంచి పైరు కంకివేసే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశిస్తుంది. ఈ పురుగును  సకాలంలో నివారించాలని వివరాలు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు