Integrated Farming : ప్రణాళిక బద్ధంగా సమీకృత వ్యవసాయం.. కొబ్బరితో పాటు చేపలు , కోళ్లు పెంపకం

కొబ్బరి నుండి ఆదాయం పొందాలంటే మూడేళ్ల పాటు ఆగాల్సిందే. అప్పటి వరకు పెట్టుబడులు, ఇంటి ఖర్చుల కోసం సమీకృత వ్యవసాయం చేయాలనుకున్నారు. అందుకే కొబ్బరితోటలోనే కొద్ది విస్తీర్ణంలో చేపల చెరువును తీసి అందులో పలు రకాల చేపలను పెంచుతున్నారు.

Integrated Farming : ప్రణాళిక బద్ధంగా సమీకృత వ్యవసాయం.. కొబ్బరితో పాటు చేపలు , కోళ్లు  పెంపకం

Integrated Farming

Updated On : June 21, 2023 / 9:44 AM IST

Integrated Farming : ఏదో ఒక పంటసాగుపై ఆధారపడి జీవించే రైతు కుటుంబాలు.. ఆదాయపరంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతుంటాయి. ముఖ్యంగా  ఎకరం, రెండెకరాల భూమి మాత్రమే కలిగిన చిన్న, సన్నకారు రైతుకుటుంబాలు ఏక పంటల సాగుతో తగినంత ఆదాయం పొందలేక అప్పుల పాలవుతున్న పరిస్థితులు.. వీటిని నుండి రైతు బయటపడాలంటే సమీకృత సేంద్రియ వ్యవసాయం ఒక్కటే మార్గం. దీన్నే ఆచరిస్తూ.. మంచి లాభాలు గడిస్తున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు.

READ ALSO : Groundnut Cultivation : వేరుశనగ సాగులో యాజమాన్యం.. అధిక దిగుబడుల కోసం శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు

సమీకృత వ్యవసాయం అంటే.. చిన్న కమతం నుంచి కూడా ఒకటికి నాలుగు విధాలుగా ఆదాయం వచ్చే విధంగా కృషి చేయ్యటం అన్నమాట. దీన్నే తూచా తప్పకుడా పాటిస్తూ.. సమీకృత వ్యవసాయం చేపట్టి.. నిరరంతరం ఆదాయం పొందుతున్నారు ఏలూరు జిల్లా, కోయిల గూడెం మండలం, కన్నాపురం గ్రామానికి చెందిన రైతు వీరగొల్ల వెంకటరమణ.

READ ALSO : Summer Cultivable Vegetables : వేసవిలో సాగుచేయాల్సిన కూరగాయ పంటలు.. అధిక దిగబడికోసం శాస్త్రవేత్తల సూచనలు

రైతు వెంకట రమణ డిగ్రి వరకు చదువుకున్నారు. వ్యవసాయంపై ఉన్న మక్కువతో.. తనకున్న రెండెకరాల పొలంలో కొబ్బరి మొక్కలు నాటారు. అయితే కొబ్బరి నుండి ఆదాయం పొందాలంటే మూడేళ్ల పాటు ఆగాల్సిందే. అప్పటి వరకు పెట్టుబడులు, ఇంటి ఖర్చుల కోసం సమీకృత వ్యవసాయం చేయాలనుకున్నారు. అందుకే కొబ్బరితోటలోనే కొద్ది విస్తీర్ణంలో చేపల చెరువును తీసి అందులో పలు రకాల చేపలను పెంచుతున్నారు.

READ ALSO : Paddy Varieties : ఖరీఫ్ కు అనువైన వరంగల్ వరి రకాలు

మరోపక్క మేలుజాతి నాటుకోళ్లను పెంచుతూ.. వాటి ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. రెక్కల కష్టాన్ని నమ్ముకునే చిన్న, సన్నకారు రైతు ఏడాది పొడవునా అనుదినం ఆదాయాన్ని అందించే విధంగా సమీకృత సేంద్రియ పద్ధతులను విజయవంతంగా ఆచరించి చూపిస్తున్నారు.