Mango Coating Precautions : మామిడి తోటల్లో ప్రారంభమైన పూత, పిందె.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Mango Coating Precautions : మామిడి పూత సాధారణంగా డిసెంబర్ , జనవరి నెలల్లో మొదలై ఫిబ్రవరి వరకు పూస్తుంది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో మామిడితోటల్లో పూత ప్రారంభమైంది.

Precautions On Mango Coating
Mango Coating Precautions : వేసవికాలం వస్తుందంటే చాలు అందరికీ మామిడిపళ్లు గుర్తొస్తాయి. అయితే మామిడి తోటలనుండి అధిక దిగుబడులు పొందాలంటే పూత, కాత దశలో తీసుకునే యాజమాన్యం పైనే ఆదారపడి ఉంటుంది. గత రెండేళ్లుగా వాతావరణ పరిస్థితుల కారణంగా మామిడి రైతులు నష్టాలనే చవిచూశారు. ఈ సారి వచ్చే దిగుబడిపైనే ఆశలు పెట్టుకున్నారు. మరి పూత పిందగా మారి కాయగా అవతరించాలంటే ముందు పూతనిలిచేందుకు సమగ్ర యాజమాన్యం చేపట్టాలని తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. హరికాంత్ పోరికా.
Read Also : Pests in Chilli Cultivation : మిరప తోటల్లో పురుగులు, తెగుళ్ల ఉధృతి.. చీడపీడల నివారణ
కాపాడుకుంటేనే అధిక దిగుబడి :
మామిడి పూత సాధారణంగా డిసెంబర్ , జనవరి నెలల్లో మొదలై ఫిబ్రవరి వరకు పూస్తుంది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో మామిడితోటల్లో పూత ప్రారంభమైంది. మరికొన్నితోటల్లో ఇంకా పూత ప్రారంభం కావాల్సివుంది. ముఖ్యంగా తోటల్లో ఎనిమిది నెలల పాటు చేపట్టే యాజమాన్య పద్ధతులు ఒక ఎత్తయితే, పూత సమయంలో పాటించే యాజమాన్యం మరో మరో ఎత్తు. మామిడిలో పూతంతా ఒకేసారి రాదు. దీంతో నెల మొత్తం పూత కాలంగా ఉంటుంది. ఈ దశలో తోటల్లో పురుగులు, తెగుళ్లు, ఆశించకుండా రైతులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
అయితే పూత ప్రారంభమయ్యే సమయంలో రైతులు సకాలంలో తగిన యాజమాన్య చర్యలు చేపట్టాలంటూ సూచిస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. హరికాంత్ పోరికా. పూత దశ దాటిన తర్వాత పిందె రాలకుండా సరైన చర్యలు తీసుకోవాలి. దానిని నివారించడానికి శాస్త్రవేత్తల సూచనల ప్రకాశం మందులను పిచికారి చేయాలి.
అలాగా సకాలంలో నీటి తడులు అందిస్తే కాయ ఎదుగుదలకు దొహద పడుతుంది. మామిడి పూత దశలో శాస్త్రవేత్తల సూచనలు పాటించి, సరైన నీటియాజమాన్యం, సస్యరక్షణ చర్యలు చేపడితే మండి దిగుబడులను తీయవచ్చు. ఇక గతేడాదితో పోలిస్తే ఈసారి మామిడి పళ్ల ధరలు కొంత మేరకు పెరిగే అవకాశం కనిపిస్తుందని మార్కెట్ వర్గాలు అంచన వేస్తున్నాయి.
Read Also : Ragi Cultivation : రాగిలో ఎరువులు, చీడపీడల నివారణ.. సమగ్ర యాజమాన్య పద్ధతులు