Sugarcane Cultivation : తెలుగు రాష్ట్రాల్లో పక్వదశకు చెరకు తోటలు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

Cutting Sugarcane : తెలుగు రాష్ట్రాలలో స్వల్ప, మధ్యకాలిక చెరకు రకాలు ఎక్కువగా సాగులో వున్నాయి. స్వల్పకాలిక రకాలు 8 నుండి 10 నెలలకు, మధ్య కాలిక రకాలు 10 నుండి 12 నెలలకు పక్వదశకు వస్తాయి.

Sugarcane Cultivation : తెలుగు రాష్ట్రాల్లో పక్వదశకు చెరకు తోటలు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

Precautions to be Taken While Cutting Sugarcane in Telugu

Updated On : December 4, 2024 / 2:39 PM IST

Sugarcane Cultivation : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చెరకు నరికేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. చెరకుసాగులో ఆది నుంచి అనేక కష్టనష్టాలను ఎదుర్కొన్న రైతాంగం.. మలిదశలో చెరకును నరికి ఫ్యాక్టరీలకు పంపే సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే దిగుబడులు ఆశాజనకంగా వుండి, పంచదార శాతం తగ్గకుండా, మంచి ఆదాయం పొందే అవకాశం వుంటుంది. మరి చెరకు నరికే  సమయంలో పాటించాల్సిన ఆ యాజమాన్య పద్ధతులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తెలుగు రాష్ట్రాలలో స్వల్ప, మధ్యకాలిక చెరకు రకాలు ఎక్కువగా సాగులో వున్నాయి. స్వల్పకాలిక రకాలు 8 నుండి 10 నెలలకు, మధ్య కాలిక రకాలు 10 నుండి 12 నెలలకు పక్వదశకు వస్తాయి. కానీ వాతావరణ ఒడిదుడుకుల వల్ల కొన్ని సంధర్భాల్లో చెరకు ఆలస్యంగా పక్వదశకు రావటం జరుగుతోంది. అలానే నీటి ముంపు పరిస్థితుల్లోను, గాలుల వల్ల తోటలు పడిపోయిన సంధర్బాల్లో ముందుగా చెరకు నరికి ఫ్యాక్టరీకి తరలించాల్సి వుంటుంది.

మనరైతులు మొక్క తోటలు నరికిన తర్వాత 1,2 కార్శీలు చేయటం అలవాటు. కాబట్టి చెరకు నరికేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకుంటే , పిలకతోటనుంచి ఎక్కువ పిలకలు వచ్చి చెరకు గడల సంఖ్య పెరుగుతుంది. చెరకులో పక్వత నిర్ధారణ ఎంత ముఖ్యమో.. రైతులు నరికేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకుని సకాలంలో ఫ్యాక్టరీలకు తరలించటం కూడా అంతే ముఖ్యం. చెరకు పక్వత నిర్ధారణ పట్ల.. చెరకు నరుకుదల విషయంలోను రైతులు ఎలాంటి మెళకువలు పాటించాలో తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా, బసంతపూర్ చెరకు పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. విజయ్ కుమార్.

సాధారణంగా మన రైతులు చెరకు నరికే పనులు కాంట్రాక్టు కూలీలకు అప్పగిస్తూ వుంటారు. పని తొందరగా పూర్తి చేయాలనే హడావిడిలో పైపైనే నరకటం వల్ల ఎకరాకు 3 నుంచి 5 టన్నుల దిగుబడి నష్టపోతుంటారు. అలాకాకుండా పదునైన కత్తితో భూమట్టానికి క్రిందగా, దుబ్బులు కదలకుండా చెరకును నరకాలి.

ఎందుకంటే పంచదార శాతం క్రింది కణుపుల్లోనే అధికంగా వుంటుంది. ఇలా భూమట్టానికి క్రిందగా నరికిన గడలను ఫ్యాక్టరీకి పంపినపుడు అధిక పంచదారశాతం వుండి, మంచి రాబడి రావటానికి అవకాశం వుంటుంది. ఇలాంటి తోటలను కార్శీ చేసినపుడు క్రొత్తగా వచ్చే పిలకలు క్రిందినుంచి రావటం వలన వేరు వ్యవస్థ బాగా వృద్ది చెందటానికి వీలుంటుంది.

Read Also : Groundnut Cultivation : రబీలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న వేరుశనగ  – సాగులో పాటించాల్సిన యాజమాన్యం