Kandi Crop : కందిలో రసంపీల్చే పురుగుల ఉధృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
Buffalo Dairy Farming : ఖమ్మం జిల్లాల్లో రసం పీల్చే పురుగైన పేనుబంక తాకిడివల్ల నష్టం అధికంగా వున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

Prevention of aphids in Kandi crop
Kandi Crop : ఖరీఫ్ కందిలో రసం పీల్చే పురుగుల ఉధృతి పెరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో కంది ప్రస్థుతం కాయ తయారయ్యే దశలో వుండగా, ఆలస్యంగా విత్తిన ప్రాంతాల్లో పూత దశకు చేరుకుంది.
ముఖ్యంగా ఖమ్మం జిల్లాల్లో రసం పీల్చే పురుగైన పేనుబంక తాకిడివల్ల నష్టం అధికంగా వున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు సత్వరమే చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు వైరా కృషి విజ్జాన కేంద్రం శాస్త్రవేత్త డా. రవి.
అపరాల పంటల్లో కందిది ప్రత్యేక స్థానం. దీనిని ఏకపంటగానే కాక పలుపంటల్లో అంతర, మిశ్రమ పంటగా సాగుచేసుకునే అవకాశం వుండటంతో చాలా మంది ఈ ఖరీఫ్ లో సాగుచేశారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో పూత, కాత దశలో ఉంది. అయితే చల్లని వాతావరణ పరిస్థితుల కారణంగా రసం పీల్చే పురుగైన పేనుబంక పంటకు తీవ్రనష్టం కలగజేస్తోంది.
ఈ పురుగు వల్ల పూత, పిందె నాశనమవటం కనిపిస్తోంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో దీని బెడద ఉధృతంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు. పేనుబంక నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు వైరా కృషి విజ్జాన కేంద్రం శాస్త్రవేత్త డా. రవి.
Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు