Pests in Sugarcane : చెరకు తోటల్లో పెరిగిన తెగుళ్లు.. నివారణ చర్యలు

Pests in Sugarcane : ప్రస్తుతం చెరకును శిలీంద్రపు తెగులైన కొరడా తెగులు, వైరస్ వల్ల వచ్చే పసుపాకు తెగులు ఆశించి తీవ్రనష్టం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. 

Pests in Sugarcane : చెరకు తోటల్లో పెరిగిన తెగుళ్లు.. నివారణ చర్యలు

Prevention of Pests in Sugarcane

Pests in Sugarcane : తెలుగు రాష్ర్టాలలో సాగవుతున్న వాణిజ్యపంటల్లో చెరకు ప్రధానమైనది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో నాటిన చెరుకు ఐదు ఆరు నెలల వయస్సులో వుంది. ఈ దశలో కొరడా తెగులు, పసుపు ఆకు తెగుళ్ల వల్ల తీవ్రంగా నష్టం జరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని అరికట్టేందుకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు తెలియజేస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. రాజ్ కుమార్.

Read Also : Agriculture Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న యువకుడు

ఉభయ తెలుగు రాష్ట్రాలలోను అధిక విస్థీర్ణంలో సాగవుతున్న వాణిజ్య పంట చెరకు. 12నెలలపాటు కొనసాగే ఈ దీర్ఘకాలపు పంటను కొంతమేర వర్షాధారంగాను, అధిక శాతం నీటి పారుదల కింద  సాగుచేస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దిగుబడిలోమనం  చాల వెనుకబడి ఉన్నాం.   ముఖ్యంగా  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో ని రైతులు ఎకరాకు 20  నుండి 25 టన్నుల దిగుబడిని మాత్రమే తీస్తున్నారు.

చీడపీడలు ఆశించినప్పుడు సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టక పోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతం చెరకును శిలీంద్రపు తెగులైన కొరడా తెగులు, వైరస్ వల్ల వచ్చే పసుపాకు తెగులు ఆశించి తీవ్రనష్టం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.  వీటి నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు  ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. రాజ్ కుమార్.

పసుపు ఆకు తెగులు ను ఆంగ్లంలో ఎల్లో లీఫ్ డిసీజ్ అనికూడా అంటారు. ఈ తెగులు వైరస్ వలన సోకుతుంది.  2006 సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కనిపించిన ఈ తెగులు 2012 -13 వరకు చెరకు సాగుచేసే ప్రాంతాలకు మొత్తం విస్తరించింది. చెరకు నాటిన 7  నుండి 8 నెలల్లో ఈ తెగులు లక్షణాలు కనబడుతాయి.

చెరకు తోటల్లో తెగుళ్లు ఆశించ కుండా ఉండాలంటే విత్తనం దగ్గర నుండి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా  ఆరోగ్యమైన తోటలనుండి విత్తనాన్ని సేకరించాలి. ఈ మధ్య కాలంలో ప్రాచుర్యం పొందుతున్న టిష్యు కల్చర్  సీడ్ తో వీటిని అధిగమించే అవకాశం ఉంది. తెగుళ్ల సోకినప్పుడు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులను పొందే అవకాశం ఉంది.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు