Banana Plantations : అరటి తోటలను పట్టిపీడిస్తున్న జింకు ధాతు లోపం.. నివారణ చర్యలు

Banana Plantations : దేశంలో మొత్తం పండ్ల తోటల విస్తీర్ణంలో 15% అరటిదే . తమిళనాడు మహారాష్ట్ర విస్తీర్ణంలో ఉత్పాదకతలోను ముందు స్థానంలో ఉండగా, తెలుగు రాష్ట్రాలు మూడవ స్థానంలో నిలిచాయి.

Banana Plantations : అరటి తోటలను పట్టిపీడిస్తున్న జింకు ధాతు లోపం.. నివారణ చర్యలు

Prevention of Zinc Deficiency in Banana Plantations

Updated On : March 8, 2024 / 4:29 PM IST

Banana Plantations : ఉద్యానవన పంటల్లో ప్రధానమైంది అరటి. ఏ సీజన్‌లోనైనా సాగుచేయదగ్గ ఈ పంటకు,   గిరాకీకి కొదవలేదు. వేసవికాలంలో ఈ పంటకు ప్రధాన సమస్య నీటిఎద్దడి. తీవ్రమైన ఎండలవల్ల తోటల్లో ఏమాత్రం బెట్ట పరిస్థితులు ఏర్పడినా వివిధ సూక్ష్మపోషక లోపాలు బయటపడతాయి. దీనివల్ల పంట పెరుగుదల లోపిస్తుంది. ప్రస్తుతం వివిధ దశల్లో వున్న అరటి తోటల్లో, జింకు ధాతు లోప ఉధృతి కనిపిస్తోంది. దీని నివారణ చర్యలను తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డా. హేమంత్ కుమార్.

Read Also : Kharbuja Cultivation : వేసవిలో మంచి డిమాండ్.. కష్టాలు తీర్చుతున్న కర్బుజా సాగు

ప్రపంచంలో అరటి ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. మన దేశంలో 4.8 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో అరటి సాగవుతుంది. అంతేకాక జాతీయ స్థాయిలో అరటి పంటదే మొదటి స్థానం. దేశంలో మొత్తం పండ్ల తోటల విస్తీర్ణంలో 15% అరటిదే . తమిళనాడు మహారాష్ట్ర విస్తీర్ణంలో ఉత్పాదకతలోను ముందు స్థానంలో ఉండగా, తెలుగు రాష్ట్రాలు మూడవ స్థానంలో నిలిచాయి. ఈ పంటకు వేసవికాలం అత్యంత గడ్డుకాలం.

పోషక లోపం నివారణ.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు : 
తీవ్రమైన ఎండలు, తరచూ నీటిఎద్దడి పరిస్థితుల వల్ల మొక్కలు తీవ్ర ఒత్తిడికి లోనవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో సూక్ష్మపోషక లోపాలు బయటపడటం కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాలో సాగవుతున్న అరటితోటల్లో జింకుదాతువు లోపంపి మొక్కలు క్షీణించటం కనిపిస్తోంది.

సరైన యాజమాన్య పద్ధతులను పాటించినట్లైతే ఈ జింకుదాతు లోపంను సమర్ధవంతంగా అరికట్టవచ్చని తెలియజేస్తూన్నారూ.. ప్రధాన శాస్త్రవేత్త డా. జె. హేమంత్ కుమార్. అరటి తోటల్లో పచ్చిరొట్ట పైర్లను వేసి కలియదున్నడం ద్వారా, జింకు దాతు లోపాన్ని నివారించవచ్చు. అంతే కాకుండా సరైన సమయంలో శాస్త్రవేత్తల సిఫార్సు మేరకు ఎరువులను అందిస్తే ఈ లోపం ఉండదు.

Read Also : Mustard Cultivation : ఆవాల సాగుకు అనువైన ప్రాంతం విశాఖ ఏజెన్సీ