Karonda Cultivation : ఒక్కసారి నాటితే ఏళ్ల తరబడి దిగుబడి – పెట్టుబడి లేని కరొండ సాగుతో సత్ఫలితాలు
Karonda Cultivation : మొత్తంగా ఖర్చులేని పంట. ఇంతకీ ఈ పంట పేరు చెర్రీ. అదేనండీ.. వాక్కాయ. ప్రకాశం జిల్లాకు చెందిన ఓరైతు ఈ పంట సాగు చేపట్టి తోటి రైతులకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు.

Profits in Karonda Cultivation
Karonda Cultivation : సాగు నీరు అవసరం లేదు. చీడపీడల బెడద అసలే ఉండదు . పంటను పశువులు తింటాయన్న భయము లేదు. దీని కొమ్మలకే ముళ్లుంటాయి కాబట్టి వేరే కంచె వేసే ఖర్చూ లేదు. మొక్కలు నాటిన మూడో ఏడాది నుంచి కాయలు కోసి అమ్ముకోవడమే.. కోత కూలి తప్ప మరే ఖర్చూ లేదు. సుదీర్ఘకాలం ఎంచక్కా పంట తీసుకుంటూనే ఉండొచ్చు. మొత్తంగా ఖర్చులేని పంట. ఇంతకీ ఈ పంట పేరు చెర్రీ. అదేనండీ.. వాక్కాయ. ప్రకాశం జిల్లాకు చెందిన ఓరైతు ఈ పంట సాగు చేపట్టి తోటి రైతులకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు.
Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు
అందరూ సాగు చేసే పంటలను పండించి, దిగుబడి లేకనో, మార్కెట్‌లో ధర దక్కకనో రైతులు ఆర్థికంగా నష్టాల పాలవుతున్న రోజులివి. అయితే, కొండంత ధైర్యంతో కొత్త పంటలపై దృష్టి సారిస్తూ.. చక్కటి ఆదాయం పొందే రైతులు కొందరే.. వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.
అటువంటి వారిలో ఒకరు మంగళపూడి కోటిరెడ్డి. ప్రకాశం జిల్లా కొరశపాడు గ్రామానికి చెందిన ఈ రైతు మొదట తన పొలం చుట్టూ జీవకంచెగా వాక్కాయను సాగుచేశారు. దీన్నే కరోండా, కలిమకాయగా కూడా పిలుస్తుంటారు. కంచెగా ఉపయోగపడుతుందనుకున్న వాక్కాయ మొక్కల నుండి 3వ ఏడాది నుండి పంట దిగుబడులు ప్రారంభమయ్యాయి. మార్కెట్ కూడా బాగుండటంతో ఏకపంటగా వాణిజ్య సరళిలో సాగుచేసి సత్ఫలితాలను పొందుతున్నారు.
ఈ పంటకు పెట్టుబడి తక్కువ. ఆదాయం ఎక్కువ. మార్కెటింగ్ మొదట్లో ఇబ్బందిగా ఉండేది. అయితే మూడు నాలుగేళ్లుగా కలకత్తానుండి వ్యాపారులు వచ్చి నేరుగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో వాణిజ్య పంటగా సాగుచేస్తున్నారు రైతు. ఈ పంట వేసిన పొలంలో ఏడాదికి రెండు నెలల్లో మాత్రమే పని ఉంటుంది. మిగతా సమయంలో ఇతర పనులు చూసుకునేందుకు రైతుకు వెసులుబాటు ఉంటుంది.
Read Also : Roopchand Fish Farming : రూప్‌చంద్ చేపల పెంపకంతో.. లాభాలు అర్జిస్తున్న రైతు