Roopchand Fish Farming : రూప్‌చంద్ చేపల పెంపకంతో.. లాభాలు అర్జిస్తున్న రైతు
Roopchand Fish Farming : మత్స్యపరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా చేపల పెంపకాన్ని కూడా మార్చుకుంటున్నారు రైతులు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా రొయ్యల సాగు తర్వాత, మంచినీటి చేపల పెంపకం కొనసాగుతుంది.

Roopchand Fish Farming and Cultivation in telugu states
Roopchand Fish Farming : మంచి నీటి చేపల పెంపకంలో బొచ్చె, రాగండి, సిల్వర్ కార్పు, గ్రాస్ కార్పు, బంగారు తీగ వంటి చేపలను శాస్త్రీయ పద్దతుల్లో పెంచుతున్నారు రైతులు. అయితే ఇందులో పెట్టుబడులు అధికం కావడమే కాకుండా, దిగుబడి కూడా ఆలస్యం అవుతుంది. అంతే కాదు వీటికి శంకజలగ, పేను లాంటి రోగాలతో నష్టాలు జరుగుతున్నాయి . ఈ నేపధ్యంలోనే ఎలాంటి రోగాలు ఆశించని రూప్ చంద్ చేపల పెంపకాన్ని 10 ఎకరాల్లో పెంచుతూ.. మంచి లాభాలను పొందుతున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు.
Read Also : Agriculture Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న యువకుడు
మత్స్యపరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా చేపల పెంపకాన్ని కూడా మార్చుకుంటున్నారు రైతులు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా రొయ్యల సాగు తర్వాత, మంచినీటి చేపల పెంపకం కొనసాగుతుంది. మంచినీటి చేపల పెంపకానికి ఉభయగోదావరి జిల్లాలు కేంద్ర బిందువుగా నిలుస్తాయి. అందువల్ల మంచినీటి చేపల పెంపకం ఈ ప్రాంత రైతులకు వరంగా మారింది. అయితే అధిక పెట్టుబడి రైతుల తెగింపు, శ్రమ, పెట్టుబడితో ఈ కల్చర్ దినదినాభివృద్ధి చెందింది.
కానీ, ఈ తెల్లచేపలకు పేనుబంక, శంకజలగ లాంటి రోగాలు రావడం.. వాటిని నివారించేందుకు అధిక ఖర్చు చేయడం జరుగుతుంది. ఒక్కోసారి చేపలు చనిపోయి.. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితులు లేవు. ఈ నేపధ్యంలోనే ఎలాంటి రోగాలు రాని రూప్ చంద్ చేపల పెంపకం విస్తరిస్తోంది. అంతే కాదు వీటి పెంపకంలో కూలీల సమస్య కూడా ఉండదు. దీంతో తూర్పుగోదావరి జిల్లా, పెరవలి మండలం, తీపర్రు గ్రామానికి చెందిన రైతు కుందుల గణపతి రావు 10 ఏళ్ళుగా 10 ఎకరాల్లో రూప్ చంద్ చేపల పెంపకం చేపడుతున్నారు.
సాధారణంగా ఎకరాకు రెండు నుండి 3 వేల రూప్ చంద్ పిల్లలను వేయాల్సి ఉంటుంది. కానీ రైతు గణపతి రావు ఎకరాకు 5 నుండి 6 వేల పిల్లలను పెంచుతున్నారు. వీటికి పిల్లెట్ ఫీడ్ అందిస్తున్నారు. అయితే చేపలు తిన్న తరువాత కొద్దోగొప్పో మిగిలిపోతే అది చెరువు అడుగు బాగంలో చేరి నీటిని కలుషితం అవుతాయి. తద్వారా చేపల పెంపకానికి ఆటంకం కలుగుతుంది.
దీనిని అరికట్టేందుకు అదే చెరువుల్లో రూప్ చంద్ చేపలతో పాటు కొద్ది మొత్తంలో శీలావతి, బొచ్చ , మోసు లాంటి తెల్ల చేపలను కూడా వేసి పెంచుతున్నారు. వృధా ఫీడ్ ను తెల్ల చేపలు తిని పెరుగుతుంటాయి. ఇటు ప్రధాన చేపలైన రూప్ చంద్ తో పాటు అదనంగా తెల్ల చేపలనుండి ఆదాయం వస్తుందని రైతు చెబుతున్నారు.
Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు