Ragi Crop : రాగిపంటకు తెగుళ్ల బెడద.. నివారిస్తే మంచి దిగుబడులు
ఖరీఫ్ లో సాగుచేసిన రాగి పంటకు అగ్గితెగులు , కాండం తొలుచు పురుగు ప్రధాన సమస్యగా మారాయి. పంట ప్రారంభంలో ఆకులమీద, కంకిదశలో మెడవిరుపు తెగులుగా వ్యాప్తిచెంది దిగుబడులకు తీవ్ర నష్టం కలిగిస్తోంది అగ్గితెగులు. వీటి ఉధృతి అధికంగా ఉంటే నివారణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది.

Ragi Crop
Ragi Crop : ఒకప్పుడు చిన్నచూపుకు గురైన చిరుధాన్యాలకు ఇప్పడు పూర్వ వైభవం వస్తోంది. చిరుధాన్యాల్లోని పోషక విలువలు, ఆరోగ్యానికి అవి చేసే మేలును గుర్తించాక మళ్ళీ వీటి వాడకం పెరిగింది. దీంతో వీటి సాగు రైతులకు లాభసాటిగా మారింది.
READ ALSO : Pests in Cotton : పత్తిలో తొలిదశలో వచ్చే చీడపీడల నివారణ
చిరుధాన్యాలలో ఒకటైన రాగిని ప్రధానంగా తెలంగాణ ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా సాగుచేస్తున్నారు. ఖరీఫ్ లో సాగుచేసిన ఈ పంటకు అగ్గితెగులు, కాండం తొలుచు పురుగు బెడద ఉంది. వీటి నివారణకొరకు పాటించాల్సిన సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు పెరుమాళ్ల పల్లె ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్ర్తవేత్త డా . మాధవి లత.
READ ALSO : Paddy Harvesting : నారు, నాట్లు అవసరం లేకుండా వరిసాగు
ఖరీఫ్ లో సాగుచేసిన రాగి పంటకు అగ్గితెగులు , కాండం తొలుచు పురుగు ప్రధాన సమస్యగా మారాయి. పంట ప్రారంభంలో ఆకులమీద, కంకిదశలో మెడవిరుపు తెగులుగా వ్యాప్తిచెంది దిగుబడులకు తీవ్ర నష్టం కలిగిస్తోంది అగ్గితెగులు. వీటి ఉధృతి అధికంగా ఉంటే నివారణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. మరి ఆ సస్యరక్షణ చర్యలేంటో పెరుమాళ్ల పల్లె ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్ర్తవేత్త డా . మాధవి లత ద్వారా తెలుసుకుందాం..
READ ALSO : Haryana: భయానక పరిస్థితులకు వణికిపోయి.. కిలోమీటర్ల మేర నడుచుకుంటూ సొంత ప్రాంతానికి..
రాగి పంటకు మార్కెట్ లో అధిక డిమాండ్ ఉంది. అలాగే అధిక దిగుబడినిచ్చే మేలైన రకాలు కూడా అందుబాటులోకరావడం చాలా మంది రైతులు సాగుకు మొగ్గు చూపుతున్నారు. అయితే రాగి సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులను సాధించే అవకాశం ఉంది.