Rice Cultivation : రబీకి అనువైన నూతన వరి రకాలు.. ఎకరాకు 30 నుంచి 34 క్వింటళ్ల దిగుబడి
Rice Cultivation : మన ప్రధాన ఆహారపంట వరి. దాదాపు అన్ని జిల్లాల్లోను కాలువలు, చెరువులు, బోరుబావుల కింద వరి సాగవుతోంది . ప్రస్థుతం వరిలో అనేక కొత్త వంగడాలను శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు.

Rice Cultivation In Rabi Season
Rice Cultivation : రబీ సమయం దగ్గర పడుతోంది . వరి రైతులు రకాలను ఎంచుకుని, విత్తనాలు సమకూర్చుకునే పనిలో వున్నారు. ఈ దశలో రకాల ఎంపిక పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలి. ప్రస్థుతం ప్రాచుర్యంలో వున్న పాత రకాలతోపాటు, అనే కొత్త వరి వంగడాలను శాస్త్రవేత్తలు సిఫారసు చేస్తున్నారు. ప్రాంతాలకు అనుగుణంగా వీటి గుణగణాలను పరిశీలించి, ఏటా సాగుచేసే సంప్రదాయ రకాల స్థానంలో వీటిని సాగుకు ఎంచుకోవచ్చు . రబీకి అనువైన నూతన వరి వంగడాలు, వాటి విశిష్ఠ లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మన ప్రధాన ఆహారపంట వరి. దాదాపు అన్ని జిల్లాల్లోను కాలువలు, చెరువులు, బోరుబావుల కింద వరి సాగవుతోంది . ప్రస్థుతం వరిలో అనేక కొత్త వంగడాలను శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు. చెరువులు, కాలువల కింద దీర్ఘకాలిక వరి రకాలు ఎక్కువగా సాగులో వుండగా, బోరుబావుల కింద స్వల్పకాలిక రకాలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. రైతులు పాత రకాలకు స్వస్తి చెప్పి, అధిక దిగుబడినిచ్చే నూతన రకాలవైపు దృష్టి సారించాలి. సరైన రకాన్ని, సరైన సమయంలో సాగుచేస్తే ప్రతి కూల పరిస్థితులను అధిగమించి 50 శాతం దిగుబడి సాధించినట్లే .
మిగతా 50 శాతం సాగులో మనం పాటించే యాజమాన్యం పై ఆధారపడి వుంటుంది. లేకపోతే ఎంచుకున్న రకం దిగుబడి సామర్థ్యం అధికంగా వున్నా ఆశించిన ఫలితాలు రావు. కాబట్టి రకాల ఎంపిక, సాగుచేసే సమయం, పంటకాల పరిమితి అనేవి వరిసాగులో కీలకమైన విషయాలుగా పరిగణించాలని సూచిస్తూ, రబీకి అనువైన నూతన వరి రకాల గురించి తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. చంద్రమోహన్.