Grapes : సేంద్రీయ పద్థితిలో ద్రాక్ష సాగుకు అనువైన నేలలు, వాతావరణం

తెలంగాణాలోని కొన్ని జిల్లాలు ద్రాక్ష సాగుకు అనుకూలంగా ఉన్నాయి. ఏపిలో అనంతపురం జిల్లాలో సైతం ద్రాక్ష సాగుకు అనుకూలం.

Grapes : సేంద్రీయ పద్థితిలో ద్రాక్ష సాగుకు అనువైన నేలలు, వాతావరణం

Grapes

Updated On : February 13, 2022 / 4:04 PM IST

Grapes : ఉద్యానవన పంటలలో ద్రాక్ష ఒకటి. మార్కెట్లో ప్రస్తుతం ద్రాక్షకు మంచి డిమాండ్ ఉంది. ఇటీవలి కాలంలో రైతులు ద్రాక్ష సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. రసాయన ఎరువులు వాడి పండించిన ద్రాక్ష కంటే ఆర్గానికి పద్దతిలో పండించిన ద్రాక్షను కొనుగోలుకు ఎక్కవ మంది మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలోనే సేంద్రియ పద్ధతులతో ద్రాక్ష సాగు చేయడం వల్ల రైతులకు మంచి అదాయం సమకూరుతుంది.

సాధారణంగా ద్రాక్షను ఎక్కువగా వైన్ తయారీకి వినియోగిస్తారు. దీంతో రెడ్ వైన్ తయారికి మస్కట్ హంబర్గ్, ఫ్రెంచ్ బ్లూ వంటి రకాలను వినియోగిస్తారు. చేనిన్ బ్లాంక్, సెమిల్లాన్ వంటి రకాలు వైట్ వైన్ తయారీలో ఉపయోగిస్తారు. నేల పీహెచ్ స్థాయిలు 5 -5.7 మధ్య ఉండే నేలలు ఈ ద్రాక్ష సాగుకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. సేంద్రియ పదార్థాలు సమృద్ధిగా ఉన్న నీటిపారుదల, లోతైన నేలలు ద్రాక్ష సాగుకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ తరహా నేలలో సాగుచేసే ద్రాక్ష అధిక దిగుబడి ఇస్తుంది.

తెలంగాణాలోని కొన్ని జిల్లాలు ద్రాక్ష సాగుకు అనుకూలంగా ఉన్నాయి. ఏపిలో అనంతపురం జిల్లాలో సైతం ద్రాక్ష సాగుకు అనుకూలం. నాణ్యత పరిమాణాలు లోపించిన నేలలు, నీరు ఉన్న ప్రదేశాలలో వేరు మూలాలు వేసుకుని ద్రాక్షను అంటుకట్టుకుంటే ఉపయోగం ఉంటుంది. బాగా వేళ్ళు వచ్చిన మొక్కల ద్వారా వేళ్లు రాని ముదురు కొమ్మలను ఒక్కొక్క పాదులో 2 నుండి 3 వరకు నాటటం ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు. బిందు సేధ్యం ద్వారా ద్రాక్ష సాగు చేపట్టవచ్చు.