Weed Control : వరి నారుమడితోపాటు, నాట్లు వేసిన తరువాత కలుపు నివారణకు తీసుకోవాల్సిన చర్యలు!

నారుమడి లో ఊద నిర్మూలన కు బొలెరో లేదా సాట్రాన్ ను 1.5 నుండి 2.0 లీటర్లు , 200 లీ నీటిలో కలిపి ఎకరా నారుమడిలో విత్తిన 7 వ లేదా 8 వ రోజు పిచికారి చేయాలి . దీని రసాయన నామం బెంథియోకర్బ్ 50% ఇ.సి . అలాగే దీనికి బదులుగా మాచేట్, టీర్, ట్రాప్, మిల్ క్లోర్, ధను క్లోర్, అను క్లోర్ వంటి మందులను వాడవచ్చు.

Weed Control : వరి నారుమడితోపాటు, నాట్లు వేసిన తరువాత కలుపు నివారణకు తీసుకోవాల్సిన చర్యలు!

Steps to be taken for weed control after planting, along with rice paddy!

Updated On : January 18, 2023 / 5:46 PM IST

Weed Control : వరి పంటలో కలుపు అనేది సర్వసాధారణం. రైతులు తగిన యాజమాన్య పద్ధతులు పాటించటం ద్వారా దీనిని నివారించుకోవచ్చు. సాధారణంగా గడ్డి జాతి, తుంగ జాతి, వెడల్పాకు అనే మూడు రకాల కలుపు ఎక్కువగా ఉంటుంది. కలుపు మొక్కల వల్ల కలిగే నష్టం ఇతర చీడ పీడల వల్ల కలిగే నష్టంతో సమానంగా నే ఉంటుంది. వరికి అందాల్సిన పోషకాలు, నీరు, ఇవి పీల్చేస్తాయి. వీటి వల్ల దిగుబడులు ఆశించినమేర రాకపోను పంటకు నష్టం వాటిల్లుతుంది. వరిలో కలుపు నివారణకు పత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. నారు మడితోపాటు, పొలంలో కలుపు నివారణ చేపట్టాల్సిన అవసరం ఉంటుంది.

నారుమడి లో కలుపు నివారణ : నారుమడి లో ఊద నిర్మూలన కు బొలెరో లేదా సాట్రాన్ ను 1.5 నుండి 2.0 లీటర్లు , 200 లీ నీటిలో కలిపి ఎకరా నారుమడిలో విత్తిన 7 వ లేదా 8 వ రోజు పిచికారి చేయాలి . దీని రసాయన నామం బెంథియోకర్బ్ 50% ఇ.సి . అలాగే దీనికి బదులుగా మాచేట్, టీర్, ట్రాప్, మిల్ క్లోర్, ధను క్లోర్, అను క్లోర్ వంటి మందులను వాడవచ్చు. లేదా విత్తిన 14, 15 రోజులకు సైహలో ఫాస్ పి బుటైల్ 10% 400 మి. లీ. 200లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి.

నాట్లు వేసిన పొలంలో కలుపు మొక్కల నివారణ: వరి నాట్లు వేసిన 3 నుండి 5 రోజుల లోపు పొలంలో పలుచగా నీరు పెట్టి 25 కిలోల పొడి ఇసుకలో 1.0 – 1.5లీ. బ్యుటా క్లోర్ 500మి. లీ. అనిలోఫాస్ లేదా ప్రిటిలా క్లోర్ లేదా 1.5 – 2.0 లీ. బెంథియోకర్బ్ కలిపి ఎకరం పొలంలో సమానంగా వెదజిల్లాలి. లేకుంటే నాట్లు వేసిన 3 నుండి 5 రోజుల లోపు ముందుగా 500 మీ.లీ. నీటిలో 35-50 గ్రా. ఆక్సాడయార్జిల్ కలిపి , ఆ తర్వాత దానిని 20 కిలోల పొడి ఇసుకలో కలిపి పొలంలో సమానంగా పడేలా వెదజల్లు కోవాలి.

గడ్డి, తుంగ, వెడల్పాటి ఆకులు ఉన్న మొక్కలు ఉంటే నాటిన 3 నుండి 5 రోజుల లోపు పొలంలో పలుచగా నీరు పెట్టి 20 కిలోల ఇసుకలో 4 కిలోల బెన్ సల్ఫయురాన్ మిథైల్ + ప్రెటిలా క్లోర్ గుళికలు ఎకరం పొలంలో సమానంగా పడేలా చల్లుకోవాలి.

నాట్లు వేసిన 15 నుండి 20 రోజులకు కొన్ని కలుపు మందులు వాడుకోవాలి. వాటిలో గడ్డి జాతి కలుపు నివారణకు ఒక ఎకరాకు సైహలో ఫాప్ పి బుటైల్ 250 నుండి 300 మి. లీ. లేదా ఫినాక్షీప్రాప్ పి ఇథైల్ 200 నుండి 250 మి. లీ. ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.

గడ్డి జాతి, తుంగ జాతి మరియు వెడల్పాకు కలుపు నివారణకు సంబంధించి బిస్ పైరి బాక్ సోడియం 100మి. లీ. లేక మెట్ సల్ఫయురాన్ మిథైల్ + క్లోరిమ్యురాన్ ఇథైల్ 8 గ్రా. ఎకరాకు 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి.