Napier Grass Cultivation : సూపర్ నేపియర్ పశుగ్రాసాలు శ్రీ సాగు యాజమాన్యం
Napier Grass Cultivation : పశుగ్రాసం అంటే రైతులకు గుర్తు వచ్చేది జొన్న, వరి, సజ్జ తదితర తృణధాన్యాలు. వీటిలో పశువులకు కావాల్సిన పోషకాలు లభించవు. పైగా వీటికి ఖర్చు అధికం. జీర్ణంకాని భాగం ఎక్కువే.

Super Napier Grass Cultivation
Napier Grass Cultivation : డెయిరీ నిర్వాహణలో పశుగ్రాసాలు ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనవి. పశుగ్రాసాలు పాడి పరిశ్రమకు పునాదులు. పశువు ఉత్పాదక సామర్థ్యం జన్యుపరంగా మేలైన జాతితోపాటు మేపుపై కూడా 60 శాతం ఆధారపడి ఉంటుంది. జన్యువేకాక, అధికపాల ఉత్పాదక శక్తి సామర్ధ్యాన్ని బహిర్గతం చేయడానికి పోషక విలువలతో కూడిన పశుగ్రాసాన్ని పుష్కలంగా అందిస్తే ఆశించిన పాల దిగుబడులు పొందవచ్చు. తక్కువ నీటితో సాగుచేయదగిన , అధిక పోషక విలువలున్న పశుగ్రాసాల వివరాలు.. సాగు యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పశుగ్రాసం అంటే రైతులకు గుర్తు వచ్చేది జొన్న, వరి, సజ్జ తదితర తృణధాన్యాలు. వీటిలో పశువులకు కావాల్సిన పోషకాలు లభించవు. పైగా వీటికి ఖర్చు అధికం. జీర్ణంకాని భాగం ఎక్కువే. అందుకే మేలైన పశుగ్రాసాల సాగుపై పాడి రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేలైన పసుగ్రాసాలను సాగు చేయటం ద్వారా అధిక పాల దిగుబడి పొందవచ్చు.
ఉన్న కొద్దిపాటి విస్తీర్ణంలో అధిక దిగుబడినిచ్చే పశుగ్రాసాలును సాగు చేయటం ద్వారా ఖర్చులను తగ్గించుకుని పశుపోషణ లాభదాయకంగా మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే మార్కెట్ లో ఉన్న అధిక పోషక విలువలు కలిగిన రకాలేంటివి.. ఎక్కడ దొరుకుతాయో తెలియజేస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లా, వెంకటరామన్న గూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. ఆనందరావు.
హైబ్రీడ్ పశుగ్రాసాల సాగుకు తక్కువ శ్రమ, పెట్టుబడి అవసరం అవుతుంది. నాటిన కొద్ది రోజుల్లోనే పశుగ్రాసం కోతకు వస్తుంది. పచ్చిమేత రుచికరంగా ఉండటం వలన పశువులు ఇష్టంగా తింటాయి. సులభంగా జీర్ణం చేసుకుంటాయి. పచ్చిమేత వలన పాల దిగుబడులు 25 శాతం వరకు పెరుగుతుంది. పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది. అయితే శాస్త్రీయ పద్ధతిలో ఈ పశుగ్రాసాలను ఏవిధంగా సాగు చేపట్టాలో వివరాలను తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త.
Read Also : Ginger Crop Farming : ప్రస్తుతం అల్లంలో చేపట్టాల్సిన సస్యరక్షణ