Taiwan Guava Cultivation : తైవాన్ జామ సాగుతో లాభాలు ఆర్జిస్తున్న కొనసీమ రైతు

జామ తోటలో అధిక దిగుబడులు సాధించాలంటే సరైన యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. రైతు మరళీకృష్ణ  ఎప్పటికప్పుడు చీడపీడలను గమనిస్తూ వాటిని నివారణకు చర్యలు చేపడుతున్నారు.

Taiwan Guava Cultivation : తైవాన్ జామ సాగుతో లాభాలు ఆర్జిస్తున్న కొనసీమ రైతు

Taiwan Guava Cultivation

Taiwan Guava Cultivation : వ్యవసాయంలో కొత్తదనాన్ని కోరుకునే ప్రతి రైతుకు ఆధునిక పద్ధతులు కొండంత అండగా నిలుస్తున్నాయి. సంప్రదాయ పంటలు ఎక్కువ సాగు చేసే కోనసీమ జిల్లాలో ఓ రైతు, ప్రయోగాత్మకంగా తైవాన్ జామ సాగుచేసి మంచి అదాయం ఆర్జిస్తున్నాడు. హైడెన్సిటీ విధానంలో జామ నాటిన ఈ రైతు మొదటి పంట దిగుబడితోనే పెట్టుబడి మొత్తం రాబట్టుకుని, లాభాల బాటపట్టాడు రెండవ సంవత్సరంలో ఎకరాకు రెండున్నర లక్షలకు పైగా ఆదాయం తీస్తున్న ఈ రైతు అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

READ ALSO : Agriculture with Mulching : మల్చింగ్ తో ఆధునిక వ్యవసాయం

శాస్త్ర సాంకేతికతలోని ప్రగతి, పండ్లతోటల సాగులో విప్లవాత్మక మార్పులకు దారితీసింది. ఒక మొక్కకు బదులు నాలుగు మొక్కలు నాటుతూ, 4 టన్నుల దిగుబడి వచ్చే చోట నాలుగింతల ఫలసాయం పొందే అవకాశం రైతులకు కలుగుతుంది. జామ సాగు ఇందుకు నిదర్శనం. అధిక సాంద్రతలో మొక్కలు నాటే ఈ విధానాల్లో  రైతులు ఎకరాకు 1000 నుంచి 2వేల మొక్కలు నాటి, మొదటి ఏడాదిలోనే మంచి ఫలసాయం సాధిస్తున్నారు. ముఖ్యంగా  మార్కెట్ లో డిమాండ్ వున్న తైవాన్ జామ రకాల సాగుకు రైతులు అధిక ఆసక్తి చూపిస్తున్నారు.

READ ALSO : Green Gram Cultivation : ఆలస్యంగా పంటలు వేసే ప్రాంతాలకు అనువైన పెసర.. అధిక దిగుబడల కోసం మేలైన యాజమాన్యం

అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట మండలం , అవిడి గ్రామంలోని రైతు గాదిరాజు మురళీకృష్ణ  గతంలో వరితో పాటు వివిధ వాణిజ్య పంటలు సాగుచేసినా అంతగా కలిసి రాలేదు. దీంతో వినూత్నంగా హైడెన్సిటీ జామ సాగుకు చేపట్టారు. జంగారెడ్డి గూడెంలోని ప్రకృతి క్లోనల్ నర్సరీ నుండి తైవన్ పింక్ రకం జామ మొక్కలను దిగుమతి చేసుకొని, ఎకరాకు 1000 మొక్కల చొప్పున  రెండు ఎకరాల్లో నాటారు. తైవాన్ జామలో నాటిన 3వ నెల నుంచి పూత, పిందె వచ్చింది. అయితే మొక్కలు ఆరోగ్యంగా పెరగాలంటే 8 నెలల వరకు పూత పిందె రాకుండా చూసుకోవాల్సి ఉంది. దీనివల్ల  మంచి ఫలసాయం వస్తుంది. సాధారణంగా జామలో సంవత్సరానికి రెండు సార్లుగా కాయ దిగుబడి తీసుకోవచ్చు. రైతు మార్కెట్ కు అనుకూలంగా కాపును నియంత్రిస్తూ, సాగులో తగిన మెలకువలు పాటిస్తున్నారు.

READ ALSO : Intercrops In Palm Oil : పామాయిల్ లో అంతర పంటలుగా కోకో, మిరియాల సాగు

జామ తోటలో అధిక దిగుబడులు సాధించాలంటే సరైన యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. రైతు మరళీకృష్ణ  ఎప్పటికప్పుడు చీడపీడలను గమనిస్తూ వాటిని నివారణకు చర్యలు చేపడుతున్నారు. హైడెన్సీటి విధానంలో నాటిన మొదటి సంవత్సరంలోనే జామతోట కాపుకు రావటం ,ఏడాదికి ఎకరాకు 20 టన్నుల చొప్పున దిగుబడి రావటం ఆశ్ఛర్యాన్ని కలిగించింది.  ప్రస్థుతం తోటనుంచి నాలుగవ సారి దిగుబడి తీసుకుంటున్నారు. సరాసరి  కిలో 25 రూపాయల చొప్పున తోట వద్దే అమ్ముతూ.. ఎకరాకు 2 లక్షల 50 వేల ఆదాయం పొందుతున్నారు మురళీకృష్ణ